KH 234 Movie : కమల్ – మణిరత్నం సినిమా.. 36 ఏళ్ళ క్రితం వచ్చిన నాయకుడు సీక్వెల్ ?

కమల్ హాసన్ మణిరత్నం కాంబోలో కమల్ హాసన్ 234వ సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.

Kamal Haasan Maniratnam KH 234 Movie will Nayakudu Sequel Rumours goes Viral

KH 234 Movie : కమల్ హాసన్(Kamal Haasan) – మణిరత్నం(Maniratnam) కాంబోలో 36 ఏళ్ళ క్రితం వచ్చిన నాయకుడు(Nayakudu) సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అప్పుడే ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయింది. బతకడానికి ముంబై వెళ్లిన ఓ యువకుడు అక్కడ ఒక ఏరియాకు నాయకుడిగా ఎలా మారతాడు అనే కథతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.

దాదాపు 36 ఏళ్ళ తర్వాత ఈ కాంబో మళ్ళీ కలవనుంది. కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ఇండియన్ 2తో రాబోతున్నాడు. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో పలకరించాడు. ఇటీవలే వీరిద్దరి కాంబోలో కమల్ హాసన్ 234వ సినిమా ప్రకటించి పూజా కార్యక్రమాలు కూడా చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.

Also Read : Salaar Movie : సలార్ పార్ట్ 2 రిలీజ్ అప్పుడేనా? పార్ట్ 1 ఇంకా రాలేదు పార్ట్ 2 గురించి చర్చ..

అయితే నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు ఉండటంతో ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారని, ఓ చిన్న గ్లింప్స్ కూడా షూట్ చేసినట్టు, దాన్ని కూడా రిలీజ్ చేస్తారని తమిళ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కథ వీరి కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాకు సీక్వెల్ లేదా అదే పాయింట్ లో ఉండే కథ అవ్వొచ్చని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.