Kamal Haasan Refused to Say Sorry even High Court gives Orders and Thug Life Postponed
Kamal Haasan : కమల్ హాసన్ – మణిరత్నం సినిమా థగ్ లైఫ్ జూన్ 5న రాబోతుంది. ఇటీవల బెంగుళూరులో ఈవెంట్ నిర్వహించగా కన్నడ భాష తమిళ్ నుంచి పుట్టింది అంటూ కమల్ హాసన్ మాట్లాడటంతో కమల్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు, కన్నడ భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ నటీనటులు, రాజకీయ నాయకులు కూడా విమర్శలు చేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు.
కమల్ క్షమాపణలు చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ చేయనివ్వం అని కర్ణాటక ఫిలిం ఛాంబర్ సైతం చెప్పింది. అయినా కమల్ నేను సారీ చెప్పను, తప్పు చేయలేదు అంటూ కోర్టుకు వెళ్లారు. కర్ణాటక హై కోర్టు సైతం మీరెవరు భాష గురించి మాట్లాడటానికి అని కమల్ ని హెచ్చరించి క్షమాపణలు చెప్పమంది. హై కోర్టు చెప్పినా కమల్ హాసన్ నేను సారీ చెప్పను అనే అంటున్నారు.
Also Read : Chiranjeevi : మీలాంటి అభిమాని ఉండటం ఆనందం.. డైరెక్టర్ కి గిఫ్ట్ ఇచ్చి స్పెషల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..
కర్ణాటక హై కోర్టు కమల్ ని క్షమాపణలు చెప్పమన్న తర్వాత కమల్.. నేను ఏం తప్పు మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పను. క్షమాపణలు తప్పు చేస్తే చెప్తారు, తప్పుగా అర్ధం చేసుకుంటే కాదు. కన్నడను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నాకు కన్నడ అంటే అమితమైన ప్రేమ ఉంది. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతానికి థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో రిలీజ్ చెయ్యట్లేదు అని లెటర్ లో ప్రస్తావించారు. కోర్టు ఈ కేసుని జూన్ 10కి వాయిదా వేసింది. అలాగే థగ్ లైఫ్ సినిమా రిలీజ్ కర్ణాటకలో ఆగిపోయింది.
హై కోర్టు చెప్పినా కమల్ సారీ చెప్పను అనడంతో ఈసారి కన్నడ నుంచే కాదు వేరే రాష్ట్రాల ప్రజలు, నెటిజన్లు కూడా కమల్ పై మరింత విమర్శలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం కానీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు కొంతమంది కన్నడిగులు. కమల్ ప్రవర్తనతో కర్ణాటకలో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. కమల్ సినిమా గురించి, డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచించట్లేదు అని, తెలియకుండా వ్యాఖ్యలు చేసినా తప్పు చేయలేదు అంటున్నారని సినీ పరిశ్రమలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కమల్ కన్నడ రగడ ఇప్పటితో అయితే ఆగేలా లేదు. కమల్ క్షమాపణలు చెప్పకపోతే కమల్ నెక్స్ట్ సినిమాలకు కూడా కర్ణాటకలో రిలీజ్ కష్టమే అంటున్నారు.
Also Read : ‘రానా నాయుడు’ సీజన్ 2 ట్రైలర్ చూశారా? మరోసారి బాబాయ్ – అబ్బాయి ఫైట్..