×
Ad

Kamal Haasan: దశాబ్దాలు తరువాత పాత దర్శకులతో జత కడుతున్న కమల్ హాసన్..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన 234వ చిత్రం గురించి ప్రకటించాడు. ఇటీవలే 'విక్రమ్' లాంటి మాస్ సినిమాతో పవర్‌ఫుల్ కమె‌బ్యాక్ ఇవ్వడంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. తాజాగా కమల్ తన తదుపరి సినిమాను గురించి అప్డేట్ ఇచ్చాడు. తమిళంలోని మరో అగ్రదర్శకుడు..

  • Published On : November 6, 2022 / 07:46 PM IST

Kamal Haasan Reunite with Mani Ratnam after 35 years

Kamal Haasan: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన 234వ చిత్రం గురించి ప్రకటించాడు. ఇటీవలే ‘విక్రమ్’ లాంటి మాస్ సినిమాతో పవర్‌ఫుల్ కమె‌బ్యాక్ ఇవ్వడంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. షూటింగ్ కి ఎన్నో అడ్డంకులు ఎదురుకాగా, ఇప్పుడు చిత్రీకరణ పూర్తీ చేసుకొనే పనిలో ఉంది చిత్ర యూనిట్.

Kamal-Chiru: కమల్ హాసన్ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్’ చిరంజీవి ప్లాప్ మూవీ ‘ఆచార్య’ రికార్డుని దాటలేకపోయింది..

తాజాగా కమల్ తన తదుపరి సినిమాను గురించి అప్డేట్ ఇచ్చాడు. తమిళంలోని మరో అగ్రదర్శకుడు ‘మణిరత్నం’తో తన 234వ చిత్రం ఉండబోతున్నట్లు నేడు వెల్లడించాడు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో తెరకెక్కిన “నాయకుడు” 1987లో విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దాదాపు 35 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు చేతులు కలుపుతున్నట్లు ఒక అనౌన్స్‌మెంట్ వీడియోని విడుదల చేశారు.

దీంతో ఈ హీరో దశాబ్దాలు కిందట పని చేసిన దర్శకులతో వరుసపెట్టి జత కట్టడంతో.. ఉలగనాయగన్ అభిమానులు సందడి చేస్తున్నారు. కాగా ఈ సినిమాను మణిరత్నం, కమలహాసన్, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. మరిన్ని వివరాలను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్-2’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తీ అవ్వగానే కమల్ సినిమాపై దృష్టి సారించనున్నాడు.