VIKRAM Movie : ‘విక్రమ్’ గా కమల్ ‘విశ్వరూపం’..

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్’..

Vikram

VIKRAM Movie: యూనివర్సల్ స్టార్, ఉలగ నాయగన్, విశ్వ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు నేడు. నవంబర్ 7తో ఆయన 67వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ వయసులోనూ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు కమల్.

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విక్రమ్’. ఇందులో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో సరికొత్తగా కనిపించబోతున్నారు కమల్ హాసన్. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

 

కమల్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ VIKRAM – The First Glance పేరుతో ఓ వీడియో వదిలారు. కమల్ యాక్షన్ సీన్‌లో అదరగొట్టేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. కమల్ నటిస్తున్న 232 సినిమా ఇది.