విశ్వనటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కాలి సర్జరీ సక్సెస్.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ..
విశ్వనటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సర్జరీ సక్సెస్ అయ్యింది. శుక్రవారం డాక్టర్లు సర్జరీ ద్వారా ఆయన కాలులో ఉన్న ఇంప్లాంట్‌ను తొలగించారు. ‘2016 లో ఆఫీసులో మెట్ల మీద కాలు జారిపడడంతో కమల్ కుడికాలికి గాయమైంది. అప్పుడు వైద్యులు ఇంప్లాంట్ అమర్చారు.
కమల్ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఈ ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చారు. చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో సర్జరీ ద్వారా కమల్ కాలిలో ఉన్న స్టీల్ ప్లేటుని తొలగించారు వైద్యులు. ఆపరేషన్ తర్వాత ఆయన కోలుకునేందుకు కనీసం నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
Read Also : దళపతి విజయ్ మైనపు విగ్రహం
డీఎంకే నేత స్టాలిన్ కమల్ హాసన్‌ను పరామర్శించారు. ప్రస్తుతం కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.