Kamalhaasan : పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్ కావాలి..

విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ''దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌ వచ్చాను..................

Kamalhaasan

Kamalhaasan :  కమల్‌హాసన్‌, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ తో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. ఈ సినిమాని తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెరకెక్కించగా కమల్ నిర్మించారు. విక్రమ్ సినిమాని పాన్ ఇండియా సినిమాగా జూన్ 3న అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాని తెలుగులో నితిన్, నితిన్ తండ్రి శ్రేష్ఠ మూవీస్ తరపున రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

 

విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ.. ”దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమాకు డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్‌ తింటున్నాను. నా కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు అందించారు. డైరెక్టర్‌ బాలచందర్‌ గారితో నేను దాదాపు 36 సినిమాలు చేశాను. అదే నాకు PHD లాంటిది. నా స్టైల్, రజనీకాంత్‌ స్టైల్‌ బాలచందర్ గారి నుంచే వచ్చాయి. వెంకీగారు ఓసారి గోవాకు వస్తే, ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వచ్చారా అని అడిగాను. మిమ్మల్ని చూడటానికి వచ్చానన్నారు. ఇప్పుడు ఈ స్టేజి మీద నా బ్రదర్‌ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.

Venkatesh : సౌత్ సినిమా కమల్‌హాసన్‌కి ముందు.. కమల్‌హాసన్‌కి తర్వాత..

నేను, వెంకీగారు కలిసి ‘మర్మయోగి’ సినిమా చేయాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చేసి ఉంటే మా ఇద్దరి కెరీర్‌లో మంచి హిట్‌గా ఉండేది. ‘విక్రమ్‌’ సినిమాకు మంచి టీమ్‌ కుదిరింది. ఈ సినిమా హిట్‌ మీ చేతుల్లోనే ఉంది. డైరెక్టర్‌ లోకేశ్‌గారు నాలాగే బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్‌ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు. పాన్‌ ఇండియా చాలదు పాన్‌ వరల్డ్‌ కావాలి మన సినిమాలకి. అది ప్రేక్షకుల సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్‌ చేయాలి. ఇవ్వడానికి మేం కూడా సిద్ధంగా ఉన్నాం. నేను మంచి సినిమాకు అభిమానిని” అని తెలిపారు.