వర్మ దివాళీ గిఫ్ట్ : ముహూర్తం ఫిక్స్ చేశాడుగా!

దీపావళి కానుకగా అక్టోబర్ 27వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ..

  • Publish Date - October 22, 2019 / 05:49 AM IST

దీపావళి కానుకగా అక్టోబర్ 27వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుంచి ఇటీవల ‘చంపేస్తాడు బాబు చంపేస్తాడు’ సాంగ్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు దీపావళికి మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు..

అక్టోబర్ 27వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ ట్రైలర్‌ను ‘పొలిటిషియన్స్, జర్నలిస్ట్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్స్, పోలీస్ పీపుల్ అండ్ కామన్ పీపు’ల్‌కు దివాళీ గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్టు తెలుపుతూ.. ‘గాడ్ బ్లెస్ #KRKR’ అంటూ ట్వీట్ చేశాడు వర్మ..

Read Also : చాణక్య : ‘గులాబి’ వీడియో సాంగ్ చూశారా..

 ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌తో వర్మ ఏ రేంజ్ కాంట్రవర్శీ క్రియేట్ చేస్తాడో చూడాలి..