సంజయ్ దత్ కోలుకోవాలని అఖండ జ్యోతి వెలిగించిన నటి..

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 01:11 PM IST
సంజయ్ దత్ కోలుకోవాలని అఖండ జ్యోతి వెలిగించిన నటి..

Updated On : August 23, 2020 / 1:24 PM IST

Kamya Panjabi Jyot for Sanay Dutt: కరోనా కారణంగా ఈ ఏడాది వినాయ‌క చ‌వితి ఘనంగా జరుపుకోవడం సాధ్యపడకపోవడంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌ల్లోనే గ‌ణ‌ప‌తి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు వినాయక చవితి పూజలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదేవిధంగా టీవీ నటి కామ్యా పంజాబీ తమ‌ ఇంటిలో గణపతిని ప్ర‌తిష్టించి, పూజ‌లు చేసి, ఆ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

బాలీవుడ్ హీరో సంజ‌య్‌ద‌త్ కోలుకోవాల‌ని ప్రార్థిస్తూ ఆమె అఖండజ్యోతి వెలిగించారు. అఖండ దీపానికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. సంజ‌య్‌ ద‌త్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న సంజయ్ త్వ‌ర‌లో అమెరికా వెళ్లి, అక్క‌డ‌ చికిత్స పొంద‌నున్నార‌ని తెలుస్తోంది. కామ్యా షేర్ చేసిన పిక్స్, వీడియో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CEJGC6NDKIt/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CEL10ypjp9o/?utm_source=ig_web_copy_link