కొరియోగ్రాఫర్‌గా మొదలై, నటుడిగా, దర్శకుడిగా ఎదిగిన సినీ ప్రముఖుడు లారెన్స్. ముని సిరీస్‌లో నాలుగో భాగంగా రాబోతున్న ‘కాంచన 3’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లారెన్స్ తెరకెక్కించి నిర్మించాడు. వేదిక, నిక్కీ తంబోలి, ఓవియా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలని వేగవంతం చేశారు. ఇటీవల చిత్రానికి సంబంధించి పలు సాంగ్స్ విడుదల చేసిన టీం తాజాగా తమిళ వర్షెన్‌కి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసింది.
ఇందులోని సన్నివేశాలు మరింత భయంకరంగా ఉన్నాయి. మెరిసిన గడ్డంతో వయసు మళ్లిన పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. కబీర్ సింగ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అసలు…ఈ హార్రర్ సినిమాతో లారెన్స్ మరోసారి ఆడియన్స్‌ను భయపెడతాడా లేదా అనేది చూడాలి.