Kangana Ranaut and adhyayan suma relationship viral again actor shekhar suman comments on kangana
Adhyayan Suman : బాలీవుడ్(Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఇప్పుడు ఎవర్ని పట్టించుకోకుండా బాలీవుడ్ మాఫియాకు దూరంగా ఉంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. కానీ కంగనా కూడా ఒకప్పుడు కమర్షియల్ సినిమాలు చేసి, ఒకరిద్దరు నటులతో రిలేషన్ కూడా నడిపింది. అందులో నటుడు అధ్యాయన్ సుమన్ ఒకరు.
బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్ కొన్ని సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. 2009 లో అధ్యాయన్ సుమన్, కంగనా జంటగా రాజ్ అనే ఓ సినిమాను చేశారు. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ క్లోజ్ అయి ప్రేమలో పడి కొన్నాళ్ళు రిలేషన్ కూడా మెయింటైన్ చేశారు. కానీ వీరిద్దరి మధ్య ఏమైందో కానీ కొన్నాళ్ళకు విడిపోయారు. అప్పట్లో కంగనా – అధ్యాయన్ సుమన్ రిలేషన్ బాలీవుడ్ లో వైరల్ అయింది. అప్పుడే అధ్యాయన్ సుమన్ తండ్రి, నటుడు శేఖర్ సుమన్ కంగనాని తిడుతూ పలు ఇంటర్వ్యూలలో విమర్శలు చేశారు. వాళ్లిద్దరూ విడిపోవడానికి అధ్యాయన్ తండ్రి శేఖరే కారణమని అంతా అనుకున్నారు.
తాజాగా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత శేఖర్ ఓ ఇంటర్వ్యూలో కంగనా – అధ్యాయన్ రిలేషన్ గురించి మాట్లాడాడు. శేఖర్ సుమన్ మాట్లాడుతూ.. కంగనా – అధ్యాయన్ ప్రేమ గురించి నాకు పూర్తిగా తెలుగు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో కూడా తెలుసు. కానీ నేనెప్పుడూ కంగనాతో మాట్లాడలేదు. ఎందుకంటే ఇది అధ్యాయన్ సమస్య. అతనే పరిష్కరించుకోవాలి. అందరూ అనుకున్నట్టు వాళ్ళ ప్రేమకు నేను వ్యతిరేకిని కాదు. కంగనా – అధ్యాయన్ విడిపోతే చూడాలని చాలా మంది అనుకున్నారు. వారిద్దరి రిలేషన్ సక్సెస్ అవ్వకపోవడానికి పరిస్థితులే కారణం అని అన్నారు. అయితే ఎప్పుడో జరిగిన విషయం గురించి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత శేఖర్ స్పందించడంతో ఇప్పుడెందుకు దాని గురించి మాట్లాడటం అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.