Kangana Ranaut : మా అక్కపై యాసిడ్ దాడి జరిగింది.. కంగనా రనౌత్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన గుర్తుకు చేసుకొని బాధపడింది. ఈ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఇద్దరు అక్కచెల్లెలు రోడ్ పై నిలబడి ఉండగా.. ఇద్దరు యువకులు బైకుపై వచ్చి, రోడ్ పై అందరూ ఉన్న సమయంలోనే అక్కపై యాసిడ్ తో దాడి చేసి పారిపోయారు. అయితే ఇటువంటి ఘటనే కంగనా...

Kangana Ranaut open up about her sister acid attack

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. తన కుటుంబంలో జరిగిన ఒక దుర్ఘటన గుర్తుకు చేసుకొని బాధపడింది. నిత్యం ఏదొక సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటది కంగనా. సినీ, రాజకీయ పరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎదుటువారికి చెమటలు పట్టిస్తుంది ఈ బాలీవుడ్ క్వీన్. తాజాగా ఈ భామ ఢిల్లీలో విద్యార్థినిపై జరిగిన యాసిడ్ దాడిపై స్పందించింది.

Kangana Ranaut: చంద్రముఖి-2 పై కంగనా హాట్ కామెంట్స్

ఈ బుధవారం ఉదయం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఇద్దరు అక్కచెల్లెలు రోడ్ పై నిలబడి ఉండగా.. ఇద్దరు యువకులు బైకుపై వచ్చి, రోడ్ పై అందరూ ఉన్న సమయంలోనే అక్కపై యాసిడ్ తో దాడి చేసి పారిపోయారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. అయితే ఇటువంటి ఘటనే కంగనా కూడా ఎదురుకునట్లు వెల్లడించింది. గతంలో కంగనా అక్క ‘రంగోలి’పై కూడా యాసిడ్ దాడి జరిగింది అంటూ బాధపడింది.

“తీవ్రంగా గాయపడిన మా అక్క దాదాపు 52 సారులు సర్జరీలు చేయించుకొంది. ఆ దుర్ఘటన తరువాత నేను బయటకి రావడానికి భయపడే దాని, ఒకవేళ వచ్చిన మొహాన్ని మొత్తం స్కార్ఫ్ తో కవర్ చేసుకొని వచ్చేదాని. ఏదేమైనా ఇటువంటి దారుణాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. అలాగే ఢిల్లీ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి” అంటూ డిమాండ్ చేసింది.