కన్నడ చిరంజీవి ఇక లేరు: అల్లు శిరీష్

  • Publish Date - June 7, 2020 / 02:19 PM IST

కన్నడ స్టార్ చిరంజీవి సర్జా ఆదివారం గుండెనొప్పితో మరణించారు. 39ఏళ్ల వయస్సున్న ఆయన బెంగళూరు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అతని హఠాన్మరణంపై తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. సౌత్ స్టార్ అల్లు శిరీశ్ ట్విట్టర్ లో ఆ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. 

‘కన్నడ యాక్టర్ చిరంజీవి సర్జా హఠాన్మరణం వార్త విని షాక్ అయ్యాను. అతనికి కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అతని కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నా.  Rest in peace, Chiru’ అని పోస్టు పెట్టారు. 

ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లై సైతం తన సంతాపాన్ని తెలియజేశారు. ‘షాక్‌తో పాటు విచారాన్ని మిగిల్చి వెళ్లిపోయాడు చిరంజీవి సర్జా. యువ టాలెంట్ వెళ్లిపోయింది. అతని కుటుంబానికి, స్నేహితులకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నా’ అని కామెంట్ చేశాడు. 

చిరంజీవి సంహారా, ఆద్య, ఖాకీ, సింగా, అమ్మా ఐ లవ్యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక, వాయుపుత్ర సినిమాల్లో నటించాడు. చివరిసారిగా కన్నడ యాక్షన్ డ్రామా శివార్జునలో కనిపించాడు.