Dinesh Mangalore: కేజీఎఫ్ విలన్,నటుడు దినేష్ కన్నుమూత.. శెట్టి పాత్రల్లో అద్భుతమైన విలనిజం

కేజీఎఫ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు దినేష్ మంగళూరు(Dinesh Mangalore) (55) కన్నుమూశారు. గత కొంతకాలంగా

Kannada actor Dinesh Mangalore passes away

Dinesh Mangalore: కేజీఎఫ్ సినిమాలో విలన్ పాత్రలో కనిపించిన సీనియర్ నటుడు దినేష్ మంగళూరు (55) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కర్ణాటకలోని కుందాపురలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాంతో, దినేష్ అకాల మరణానికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. ఇక కేజీఎఫ్ సినిమాలో బాంబే మాఫియా డాన్ శెట్టి పాత్రలో ఆయన అద్భుతమైన నటనను కనబరిచాడు. అయితే దినేష్(Dinesh Mangalore) చాలా మందికి నటుడిగానే తెలుసు కానీ, ఆయన కన్నడలో చాలా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు. చంద్రముఖి ప్రాణసఖి, వీర మాటకారి, రాక్షస వంటి చిత్రాలకు మంచి గుర్తింపు పొందారు.

Toxic: యష్ టాక్సిక్ కోసం హాలీవుడ్ స్టెంట్ మెన్.. నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ లో యష్

మంగళూరుకు చెందిన దినేష్ కు చిన్నతనం నుంచి నాటక రంగంపై ఆసక్తి ఉండేది. ఆలా, నాటక రంగంలో బలమైన నేపథ్యంతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మొదట ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటికీ.. కె.ఎం. చైతన్య నటించిన ‘ఆ దినగలు’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత కూడా వరుస చిత్రాల్లో నటించాడు దినేష్ కానీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF సినిమాలో శెట్టి పాత్రలో పవర్ ఫుల్ విలనిజం కనబరిచాడు. ఈ సినిమా అందించిన విజయంతో వరుసగా హరికథ అల్లా గిరికథ, ఉలిదవరు కందంతే, రికీ వంటి చిత్రాలలో నటించి మెప్పించాడు.