Rajinikanth: సెన్సేషనల్ కాంబో.. రజినీకాంత్ తో నాగ్ అశ్విన్ మూవీ.. అనౌన్స్మెంట్ ఎప్పుడంటే?
కూలీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాల్లో వేసుకున్నారు తమిళ సూపర్ స్టార్(Rajinikanth) రజినీకాంత్. స్టార్ డైరెక్టర్ లోకేష్

Rajinikanth's next movie with director Nag Ashwin
Rajinikanth: కూలీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాల్లో వేసుకున్నారు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే రేంజ్ కలెక్షన్స్ కూడా రాబట్టింది ఈ మూవీ. ఇదిలా ఉంటే, కూలీ తరువాత రజినీకాంత్(Rajinikanth) చేయబోయే సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో భాగంగానే రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమాను మళ్ళీ లోకేష్ తోనే చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
Neeli Neeli Akasham Song Sequel : ఆ సూపర్ హిట్ సాంగ్ కి సీక్వెల్ వచ్చేసింది.. భలే రాసారే..
ఈ ప్రాజెక్టులో రజినీకాంత్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని, ఇండియా లేవల్లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమా రాబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఈ ప్రాజెక్టు గురించి మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ నెక్స్ట్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. కల్కి సినిమాతో ఇండియన్ సినిమాకు హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ ని పరిచయం చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ప్రస్తుతం ఆయన కల్కి సినిమాకు సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. అయితే, ఇటీవల నాగ్ అశ్విన్ రజినీకాంత్ ను కలిసి ఒక పాయింట్ చెప్పాడట. నాగ్ అశ్విన్ చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట రజినీ. తొందరగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని సూచించాడట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుంది అంటూ చెన్నై వర్గాల్లో టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే, వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తాడని తెలుస్తోంది.