Toxic: యష్ టాక్సిక్ కోసం హాలీవుడ్ స్టెంట్ మెన్.. నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ లో యష్

కన్నడ స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్(Toxic) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను

Toxic: యష్ టాక్సిక్ కోసం హాలీవుడ్ స్టెంట్ మెన్.. నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్ లో యష్

Hollywood stuntman JJ Perry working on the movie Toxic

Updated On : August 25, 2025 / 12:33 PM IST

Toxic: కన్నడ స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అటు కన్నడతో పాటు ఇంగ్లీష్ లో ఏకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇండియా నుంచి ఇంగ్లీష్ లో తెరకెక్కిస్తున్న మొట్టమొదటి సినిమాగా ఇప్పటికే టాక్సిక్ సరికొత్త రికార్స్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే టాక్సిక్(Toxic) సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా ఇంటర్నేషనల్ వైడ్ లో ట్రెండ్ అవుతోంది.

Pawan Kalyan : OG నుంచి కలర్ ఫుల్ పోస్టర్.. సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే, భారీ వ్యయంతో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా కోసం హాలీవుడ్ లెజండ్న్ స్టెంట్ కొరియోగ్రాఫర్ జేజే పెర్రీ వర్క్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని మూవీ టీం సోషల్ మీడియాలో ఆడియన్స్ తో పంచుకుంది. టాక్సిక్ సెట్స్ లో హీరో యష్, జేజే పెర్రీ కలిసి ఉన్న ఫోటోలను ఎక్స్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు 80 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చ్ 19 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.