Santhosh Balaraj : కన్నడ హీరో కన్నుమూత.. 34 ఏళ్ళ వయసులోనే..

కన్నడ హీరో సంతోష్ బాలరాజ్ నేడు ఉదయం మరణించారు.

Santhosh Balaraj

Santhosh Balaraj : కన్నడ హీరో సంతోష్ బాలరాజ్ నేడు ఉదయం మరణించారు. నిర్మాత అనేకల్ బాలరాజ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి కెంపా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంతోష్ బాలరాజ్. ఆ తర్వాత హీరోగా గణప అనే సినిమాతో హిట్ కొట్టాడు. సత్యం, కరియా 2 పలు సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాడు.

Also Read : Tollywood Strike : టాలీవుడ్ సమ్మెపై ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మంచు విష్ణు చర్చలు.. ఇప్పటికే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం..

సంతోష్ బాలరాజ్ గత కొన్ని రోజులుగా జాండీస్ తో బాధపడుతున్నాడు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరగా చికిత్స తీసుకుంటూ నేడు ఉదయం జాండీస్ తోనే మరణించాడు సంతోష్ బాలరాజ్. దీంతో అతని అభిమానులు, కన్నడ నటీనటులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. 34 ఏళ్ళ వయసులోనే ఇలా సంతోష్ మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదంనెలకొంది.