Dhanya Ramkumar : కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న రాజ్ కుమార్ మనవరాలు..

ధన్య రామ్ కుమార్ శాండల్ వుడ్‌లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది..

Dhanya Ramkumar : కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న రాజ్ కుమార్ మనవరాలు..

Dhanya Ramkumar

Updated On : July 26, 2021 / 1:27 PM IST

Dhanya Ramkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు కన్నడ సినీ రంగంలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్‌ల మేనకోడలు ధన్య రామ్ కుమార్ శాండల్ వుడ్‌లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

Rajkumar Family

 

రాజ్ కుమార్, పార్వతమ్మ దంపతులకు శివ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్‌లతో పాటు పూర్ణిమ అనే కుమార్తె ఉన్నారు. ఆమె పాపులర్ యాక్టర్ రామ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. పూర్ణిమ-రామ్ కుమార్‌ల కుమార్తె ధన్య రామ్ కుమార్. సూరజ్ గౌడ హీరోగా నటించిన ‘నిన్న సన్నిహకే’ (Ninna Sanihake) మూవీతో ధన్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Dhanya Ramkumar Parents

 

ఫస్ట్ సినిమా పోస్టర్లు, ప్రోమోలతోనే అమ్మాయి ముఖంలో మంచి కళ ఉంది, తప్పకుండా మంచి నటి అవుతుందని కన్నడ ప్రేక్షకులు, రాజ్ కుమార్ కుటంబ అభిమానులు ప్రశసించారు. తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న ధన్య, ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సాధారణంగా నటుల తనయులే వారసులుగా ఎంట్రీ ఇస్తారు. అందుకు భిన్నంగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ధన్య రామ్ కుమార్.. తాత, తండ్రి, మేనమామల వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటానని చెప్తోంది.