Puneet Funeral : రేపు పునీత్ అంత్యక్రియలు, కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టిన అభిమానులు

అమెరికా నుంచి బెంగళూరుకు పునీత్ పెద్ద కుమార్తె వందిత రానున్నారు. 2021, అక్టోబర్ 31వ తేదీ ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Puneeth Rajkumar Donated His Eyes

Kannada Power Star : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హాఠాన్మరణం అందర్నీ శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులర్పిస్తున్నారు. పునీత్ మరణవార్తతో సినీయావత్తు తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. తమ అభిమాన హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ను చివరిసారిగా చూసేందుకు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు అభిమానులు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న జనాన్ని కట్టడి చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. వేలాదిగా వస్తున్నవారిని క్యూలైన్లలో పంపిస్తుండేసరికి ఒకరమీద మరొకరు పడుతున్నారు. కోవిడ్‌ కట్టడికి… ఎంట్రన్స్‌లో పెద్ద పెద్ద మిషన్లతో శానిటైజేషన్‌ చేస్తున్నారు.

Read More : Puneeth Rajkumar: సామాజిక సేవలో పవర్ స్టార్.. రైతుల కోసం ఉచితంగా ప్రకటనల్లో నటించాడు

అమెరికా నుంచి బెంగళూరుకు పునీత్ పెద్ద కుమార్తె వందిత రానున్నారు. 2021, అక్టోబర్ 31వ తేదీ ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పునీత్‌ రాజ్‌కుమార్‌ పార్థివదేహానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులు అర్పించారు. పునీత్ భౌతికకాయాన్ని చూస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు జూనియర్‌ ఎన్టీఆర్. పునీత్‌ సోదరుడిని హత్తుకుని ఓదార్చారు. పునీత్‌ రాజ్‌కుమార్‌కు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్‌కు హీరోలు బాలకృష్ణ, రాణా, ప్రభుదేవా నివాళులు అర్పించారు. అంతకుముందు పునీత్‌కు కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైతో పాటు ప్రముఖులు నివాళులు అర్పించారు.

Read More :Puneeth Rajkumar : తన స్నేహితుణ్ణి చూసి ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

తెర ముందు కాదు.. తెర వెనుక కూడా ఆయనే హీరో. సినిమాలతో అభిమానులను మెప్పించడమే కాదు.. బయట ఎంతో మంది ప్రేక్షకులను కూడా సంపాదించడం ఆయనకే చెందింది. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్నదే ఆయన మాట. ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్‌ చేసినా.. అణువంతైనా గర్వాన్ని ఎక్కించుకోకపోవడమే అయన్ను కన్నడ చిత్ర సీమకే పవర్‌ స్టార్‌ ను చేశాయి. అభిమానుల గుండెల్లో రారాజుగా నిలిపాయి. పునీత్ రాజ్‌కుమార్.. కన్నడ సినీ పరిశ్రమలోనే కాకుండా యావత్ దేశం తలుచుకుంటున్న పేరు. 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో హఠాత్మరణం చెందారు. లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్,  పార్వతమ్మ కుమారుడు పునీత్ రాజ్‌కుమార్‌. తెరపై తన అసాధారణమైన పాత్రలతో పునీత్ దక్షిణాదిలో తనకంటూ భారీ అభిమానులను సృష్టించుకున్నాడు.