Karmanye Vadhikaraste
Karmanye Vadhikaraste : ఉషస్విని ఫిలిమ్స్ బ్యానర్ పై పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా బ్రహ్మాజీ, శత్రు మెయిన్ పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కర్మణ్యే వాధికారస్తే’. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం,శ్రీ సుధా.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. DSS దుర్గా ప్రసాద్ నిర్మాణంలో అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Karmanye Vadhikaraste)
ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ని రిలీజ్ చేసారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కర్మణ్యే వాధికారస్తే సెప్టెంబర్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.
Also See : Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..
ఈ సందర్భంగా మూవీ యూనిట్ మాట్లాడుతూ.. కర్మణ్యే వాధికారస్తే అనేది భగవద్గీత లోని ఒక పదం. దాని అర్థం పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు అని. టైటిల్ కి తగ్గట్టు కథ కూడా గ్రిప్పింగ్ గా ఉంటుంది. సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్, స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్.. ఇలాంటి వాటితో ఈ సినిమా తెరకెక్కింది.
Also See : Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ వినాయక చవితి పూజలు.. ఫొటోలు..