Bigg Boss Kannada 10: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే..

బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ షో మ‌న‌దేశంలోని చాలా బాష‌ల్లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది.

MLA Pradeep Eshwar enters Bigg Boss

MLA Pradeep Eshwar : బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ షో మ‌న‌దేశంలోని చాలా బాష‌ల్లో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. క‌న్న‌డ‌లో బిగ్‌బాస్ 9 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. తాజాగా ప‌దో సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఈ షోకి స్టార్ న‌టుడు కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం ఈ సీజ‌న్ ప్రారంభ‌మైంది. కొంత మంది కంటెస్టెంట్ల‌ను హౌస్‌లోకి పంపించారు.

ఇక సోమ‌వారానికి సంబంధించిన ప్రొమో విడుద‌లైంది. ఇందులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ షాకైయ్యారు. ‘వాస్త‌వానికి నిన్న‌నే బిగ్‌బాస్ హౌస్‌లోకి రావాల్సి ఉంది. అయితే.. ఈ రోజు వ‌చ్చాను. కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్ట‌డం చాలా ఆనందంగా ఉంది.’ అంటూ ప్రదీప్ ఈశ్వర్ అన్నారు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు సినీ సెల‌బ్రెటీలు, సోష‌ల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్స్, కామన్ మ్యాన్స్ ఇత‌ర రంగాల‌కు చెందిన వారు బిగ్‌బాస్‌లోకి వెళ్లారు. అయితే.. ఓ రాజ‌కీయ నాయ‌కుడు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్ట‌డంతో రాజ‌కీయ దుమారం చెల‌రేగింది.

Ganapath Trailer : టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ ట్రైలర్ రిలీజ్.. ఇది సూపర్ హీరో సినిమా కాదా.. స్పోర్ట్స్ మూవీనా..?

దీనిపై ప్ర‌తి ప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కొంద‌రు నెటీజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా విరుచుకుప‌డుతున్నారు. ఎమ్మెల్యే రియాలిటి షోలో అడుగుపెట్ట‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జాసేవ కోసం ఎన్నికైన వ్య‌క్తి బాధ్య‌తారాహిత్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌ని మండిప‌డుతున్నారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న ప్రదీప్ ఈశ్వర్.. కర్ణాటక మాజీ మంత్రి కె.సుధాకర్‌కు షాకిచ్చి గెలుపొందారు.

ప్రదీప్ ఈశ్వర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ల‌డంపై జెడి(ఎస్) అభ్యర్థిగా పోటీ చేసిన కెపి బచ్చెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది అతని వ్యక్తిగత సమస్య. నాకు ఉన్న‌ సమాచారం ప్రకారం.. అతను కొద్ది రోజుల త‌రువాత బ‌య‌ట‌కు వ‌స్తాడు.’ అని అన్నారు.

Ram Charan : విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ క్యామియో ఉందా..? మహేష్ బాబు ఏం చెప్పాడు..?