Karthi Annagaru Vastaru movie OTT streaming update.
Annagaru Vastharu OTT: తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘వా.. వాతియార్’. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే, ఈ సినిమా పలు వాయిదాల తరువాత సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు విడుదల తరువాత మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు. కథ, కథనాలు చాలా పేలవంగా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
Devara 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘దేవర 2’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
ఇక ఈ సినిమాను ‘అన్నగారు వస్తారు(Annagaru Vastharu OTT)’ అనే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. కానీ, ఆ సమయంలో థియేటర్స్ దొరక్క పోవడంతో తెలుగు డబ్బింగ్ విడుదల పోస్ట్ పోన్ చేశారు. ఇక అప్పటినుంచి ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదల అవుతుంది అని కార్తీ ఫ్యాన్స్ చూస్తున్నారు. కానీ, వారికి షాక్ ఇస్తూ ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారు మేకర్స్.
ఈమేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. ‘అన్నగారు వస్తారు’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. జనవరి 28 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారిక పోస్టర్ విడుదల చేశారు. దీంతో, కార్తీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.