Karthi Japan Movie Trailer Released
Japan Trailer : కోలీవుడ్ హీరో కార్తీకి(Karthi) తెలుగులో మంచి మార్కెట్, అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సర్దార్ సినిమాతో వచ్చి ఇక్కడ కూడా మంచి విజయం సాధించాడు. ఇప్పుడు జపాన్ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ సినిమాగా ‘జపాన్’ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది ఈ సినిమా.
Also Read : Kamakshi Bhaskarla : వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు.. టాలీవుడ్ పై వ్యాఖ్యలు చేసిన నటి..
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ అన్ని వైరల్ అయ్యాయి. కార్తీ డిఫరెంట్ లుక్ లో, డిఫరెంట్ గా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజయింది. కార్తీ చిన్నప్పటి నుంచే దొంగతనాలు మొదలుపెట్టినట్టు, తర్వాత కేవలం బంగారం మాత్రమే దొంగతనం చేసే గజదొంగగా మారినట్టు చూపించారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారా లేదా అనేది కథగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా తమిళనాడు గజదొంగ తిరువారూర్ ముర్గన్ కథతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాని దీపావళికి రిలీజ్ చేయనున్నారు.