×
Ad

Annagaru Vostaru : కార్తీ ‘అన్నగారు వస్తారు’ ట్రైలర్ రిలీజ్.. సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో.. ఇదేదో కొత్తగా ఉందే..

మీరు కూడా అన్నగారు వస్తారు ట్రైలర్ చూసేయండి.. (Annagaru Vostaru)

Annagaru Vostaru

Annagaru Vostaru : తమిళ్ స్టార్ హీరో కార్తీ – కృతిశెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘వా వాతియార్’. తెలుగులో ఈ సినిమా ‘అన్నగారు వస్తారు’ అనే పేరుతో రిలీజ్ కాబోతుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Annagaru Vostaru)

అన్నగారు వస్తారు సినిమా డిసెంబర్ 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా అన్నగారు వస్తారు ట్రైలర్ చూసేయండి..

Also Read : Prabhas : పాపం.. ‘లవ్’ స్పెలింగ్ మర్చిపోయిన ప్రభాస్.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ సరదా కామెంట్స్..

ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది ప్రస్తుత కథతో పాటు పీరియాడిక్ కథ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ తో ఈ సినిమాలో హీరో పాత్ర ఉండబోతుందని, తమిళ్ లో మాత్రం ఎన్టీఆర్ బదులు ఎంజీఆర్ ఉంటాడని, హీరో పోలీస్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. ట్రైలర్ అయితే కొత్తగా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.