Prabhas : పాపం.. ‘లవ్’ స్పెలింగ్ మర్చిపోయిన ప్రభాస్.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ సరదా కామెంట్స్..

ఇటీవలే ప్రభాస్ బాహుబలి రెండు సినిమాలు కలిపి బాహుబలి ఎపిక్ గా రిలీజ్ అయిన అయింది. (Prabhas)

Prabhas : పాపం.. ‘లవ్’ స్పెలింగ్ మర్చిపోయిన ప్రభాస్.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ సరదా కామెంట్స్..

Prabhas

Updated On : December 6, 2025 / 5:18 PM IST

Prabhas : అప్పుడప్పుడు మన సెలబ్రిటీలు అనుకోకుండా మర్చిపోయిన సందర్భాలు, చేసిన చిన్న చిన్న తప్పులు సరదాగా వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్స్ కూడా వాటిని క్యూట్ గా కామెడీగా తీసుకుంటారు. ఇప్పుడు ప్రభాస్ లవ్ స్పెలింగ్ మర్చిపోవడం అలాగే వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో రాజాసాబ్ సినిమా సంక్రాతికి రానుంది.(Prabhas)

అయితే ఇటీవలే ప్రభాస్ బాహుబలి రెండు సినిమాలు కలిపి బాహుబలి ఎపిక్ గా రిలీజ్ అయిన అయింది. ఈ ఎపిక్ కి కూడా మంచి ఆదరణ వచ్చింది. ఇక జపాన్ లో మన తెలుగు సినిమాలకు, హీరోలకు ఫ్యాన్స్ ఎక్కువ అని తెలిసిందే. ప్రభాస్ బాహుబలి కూడా అక్కడ బాగా ఆడింది. ప్రభాస్ కి కూడా వీరాభిమానులు ఉన్నారు అక్కడ. దీంతో బాహుబలి ఎపిక్ సినిమాకి అక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు.

Also Read : Sankranthi Movies : అరేయ్ బాబు.. సంక్రాంతికి ఇంకెన్ని సినిమాలు రిలీజ్ చేస్తార్రా..? లిస్ట్ చాంతాడంతా పెరిగింది..

ఈ క్రమంలో ప్రభాస్ జపాన్ లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. జపాన్ నుంచి ప్రభాస్ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

అయితే జపాన్ లో ఓ ప్రభాస్ అభిమాని బాహుబలి పోస్టర్ తీసుకొచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడు. ప్రభాస్ దానిపై విత్ లవ్ అని రాసి సంతకం పెట్టాడు. ఈ క్రమంలో LOVE స్పెల్లింగ్ కి మొదట LOE రాసి కాసేపు ఆలోచింది దాన్ని మార్చి LOVE అని రాసాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్లు ఈ వీడియోని సరదాగా వైరల్ చేస్తూ.. ప్రభాస్ అన్న ఎంత మంచోడు అంటే అన్నకు లవ్ స్పెలింగ్ కూడా తెలీదు అని, ప్రభాస్ అన్న లైఫ్ లో లవ్, పెళ్లి లాంటివి లేవని, ప్రభాస్ కు ఫుడ్ స్పెలింగ్ తెలుస్తుంది కానీ లవ్ స్పెల్లింగ్ తెలీదు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఇక కొంతమంది అయితే ఆర్య 2 సినిమాలో ఐ లవ్ యు స్పెలింగ్ ఏంటి సర్ అనే మీమ్ తో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Also Read : Akhanda 2 : ఛ.. అఖండ 2 నిర్మాత మారకపోయి ఉంటే బాగుండేది.. ఈ పాటికి సినిమా చూసి హిట్ కొట్టేవాళ్ళం.. ఫ్యాన్స్ ఆవేదన..