Sankranthi Movies : అరేయ్ బాబు.. సంక్రాంతికి ఇంకెన్ని సినిమాలు రిలీజ్ చేస్తార్రా..? లిస్ట్ చాంతాడంతా పెరిగింది..

సారి 2026 సంక్రాంతి లిస్ట్ కూడా పెద్దదే. (Sankranthi Movies)

Sankranthi Movies : అరేయ్ బాబు.. సంక్రాంతికి ఇంకెన్ని సినిమాలు రిలీజ్ చేస్తార్రా..? లిస్ట్ చాంతాడంతా పెరిగింది..

Sankranthi Movies

Updated On : December 6, 2025 / 4:46 PM IST

Sankranthi Movies : ప్రతి పండక్కి సినిమాని రిలీజ్ చేయాలని అందరూ ట్రై చేస్తారు. కానీ సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. సంక్రాంతికి కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. పెద్ద చిన్న హీరోలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా తోడవుతాయి. సంక్రాంతి పెద్ద పండగ కావడం, హాలిడేస్ ఎక్కువ ఉండటం, ఫ్యామిలీలు అంతా కలిసి సినిమాకు వెళ్లడం ఉంటుంది కాబట్టి ఎలాగైనా సంక్రాంతికి తమ సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటారు. ఒకవేళ సినిమా టాక్ ఎలా ఉన్న కనీసం కలెక్షన్స్ వచ్చి సేఫ్ అయిపోతాం అనుకుంటారు. కానీ రాను రాను సంక్రాంతి పోటీ ఎక్కువైపోయింది. పెద్ద చిన్న హీరోలు, డబ్బింగ్ సినిమాలతో సంక్రాంతికి రావాల్సిన సినిమాల కంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఈసారి 2026 సంక్రాంతి లిస్ట్ కూడా పెద్దదే.

Sankranthi Movies

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. అనిల్ రావిపూడి అంటేనే పండక్కి వస్తాడు కాబట్టి ఆయన గత సినిమా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయి హిట్ అయిన వెంటనే చిరంజీవితో సినిమా అనౌన్స్ చేసి సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించేసారు.

ఆ తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ ఆయన చివరి సినిమా జననాయగాన్ ని సంక్రాంతికే తెస్తున్నారు. అది డబ్బింగ్ సినిమా అయినా విజయ్ సినిమాలకు ఇక్కడ మంచి మార్కెట్ ఉంది.

Also Read : Akhanda 2 : ఛ.. అఖండ 2 నిర్మాత మారకపోయి ఉంటే బాగుండేది.. ఈ పాటికి సినిమా చూసి హిట్ కొట్టేవాళ్ళం.. ఫ్యాన్స్ ఆవేదన..

ప్రభాస్ రాజాసాబ్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2025 ఏప్రిల్ నుంచి వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి తీసుకెళ్లి 2026 సంక్రాంతి బరిలో పెట్టారు. దీంతో సంకాంతికి పెద్ద పోటీ నెలకొంది.

ప్రతి సంక్రాంతి లాగే ఈసారి కూడా ఓ చిన్న సినిమా బరిలో నిల్చుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మొదట ఈ నాలుగు సినిమాలే ఉన్నాయి. ఎప్పట్లాగే తెలుగు మూడు సినిమాలు, డబ్బింగ్ ఒకటి అనుకున్నారు. కానీ సడెన్ గా లిస్ట్ పెరిగిపోయింది.

ఇటీవల రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాని సంక్రాంతికి ప్రకటించాడు. ఈ సినిమా ఇటీవలే మొదలయింది. ఇంకా షూట్ జరుగుతుంది. కానీ పండగను క్యాష్ చేసుకోవడం కోసం సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసారు.

Also See : Pawan Kalyan : స్కూల్ పిల్లలతో పవన్.. పవర్ స్టార్ పక్కనుండటంతో పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి.. ఫోటోలు వైరల్..

అసలు లిస్ట్ లో లేని శర్వానంద్ సడెన్ గా ఊడిపడ్డాడు. శర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అని నిన్నే ప్రకటించారు. ఆల్రెడీ ఇన్ని సినిమాలు ఉన్నా శర్వా ఎందుకు తన సినిమాని సంక్రాంతికి ప్రకటించాడో మరి.

మరో డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతికి జత చేరింది. శివ కార్తికేయన్ – శ్రీలీల జంటగా నటిస్తున్న పరాశక్తి సినిమా సంక్రాంతికి ప్రకటించారు. దీంతో 2026 సంక్రాంతికి టాలీవుడ్ లో ఆరు సినిమాలు బరిలో నిలుస్తున్నాయి.

అయితే ఇటీవల డిసెంబర్ 5 న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని అంటుంటే పలువురు మాత్రం ఈ సినిమా సంక్రాంతి బరిలో వస్తుందని అంటున్నారు. ఒకవేళ అఖండ 2 కూడా సంక్రాంతి బరిలో దిగితే మాత్రం పోటీ మాములుగా ఉండదు. దానికి తోడు థియేటర్స్ సమస్య వస్తుంది, కలెక్షన్స్ తగ్గుతాయి. మరి సంక్రాంతి వరకు ఎవరైనా వెనక్కి తగ్గుతారేమో చూడాలి.