Vaa Vaathiyaar : కార్తీ, కృతిశెట్టి సినిమా.. ‘వా వాతియార్’ టీజర్ వచ్చేసింది..

తాజాగా నేడు కార్తీ, కృతిశెట్టి సినిమా వా వాతియార్ టీజర్ రిలీజ్ చేసారు.

Karthi Krithi Shetty Vaa Vaathiyaar Teaser Released

Vaa Vaathiyaar : కృతిశెట్టి తెలుగులో అవకాశాలు తగ్గడంతో మలయాళం, తమిళ్ లో ఫోకస్ చేసింది. దీంతో అక్కడ వరుస సినిమాలు చేస్తుంది. తమిళ్ స్టార్ హీరో కార్తీ సరసన కృతిశెట్టి వా వాతియార్ అనే సినిమాలో నటిస్తుంది. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Rashmika Mandanna : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన రష్మిక మందన్న.. సినిమాపై హైప్ పెంచుతూ పోస్ట్..

తాజాగా నేడు వా వాతియార్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ అంతా ఓ మ్యూజిక్ బిట్ తో కార్తీ డ్యాన్స్ చేస్తూ ఉండగా మిగిలిన పాత్రలు పరిచయం చేసారు. టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాలో కార్తీ పోలీస్ పాత్రలో నటించబోతున్నట్టు, యాక్షన్ తో పాటు కామెడీ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే పీరియాడిక్ సినిమా అని తెలుస్తుంది. మీరు కూడా వా వాతియార్ టీజర్ చూసేయండి..

 

ఈ సినిమా తమిళ్ లో తెరకెక్కుతుండగా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఈ సినిమా అయినా కృతిశెట్టికి హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి. ఇక కార్తీ ఇటీవలే సత్యం సుందరం సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి హిట్ కొట్టాడు.