Karthi – Pawan Kalyan : కార్తీ – పవన్ లడ్డు వివాదం.. అసలు కార్తీ లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.. ఈవెంట్లో ఏం జరిగింది..?

అసలు కార్తీ ఏం మాట్లాడారు.. అసలేం జరిగింది..

Karthi Pawan Kalyan Laddu Issue Full Details Here From Movie Event

Karthi – Pawan Kalyan : గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయంగా తిరుపతి లడ్డు వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ నాయకులు వారి వారి అభిప్రాయాలను మాట్లాడుతున్నారు. అయితే నిన్న రాత్రి సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ అనుకోకుండా ఈ లడ్డు వివాదం గురించి వ్యంగ్యంగా మాట్లాడటంతో అది వైరల్ అయింది. దీంతో ఇవాళ పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని కూడా గుర్తుచేస్తూ.. నిన్న ఓ సినిమా ఫంక్షన్ లో లడ్డు సెన్సిటివ్ టాపిక్ అంటూ మాట్లాడారు. మిమ్మల్ని నటులుగా గౌరవిస్తాను కానీ ఇలాంటి అంశాలను అపహాస్యం చేస్తే తగదు అంటూ సీరియస్ గానే స్పందించారు. దీనికి కార్తీ వెంటనే పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాడు.

దీంతో కార్తీ – పవన్ లడ్డు వివాదం తెలుగు – తమిళ్ రాష్ట్రాల్లో చర్చగా మారింది. కొంతమంది పవన్ తప్పు అంటే, కొంతమంది కార్తీ తప్పు అని, ఇంకొంతమంది అసలు ప్రశ్న అడిగిన యాంకర్ తప్పు అని, ఇంకొంతమంది ఆ ప్రశ్న తయారుచేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థది తప్పు అని మాట్లాడుతున్నారు.

Also Read : Actor Karthi : డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన హీరో కార్తీ

అసలు కార్తీ ఏం మాట్లాడారు.. అసలేం జరిగింది..

నిన్న రాత్రి సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సరదాగా హీరో కార్తీని మాట్లాడిస్తుంది. ఈ క్రమంలో అక్కడ వేదికపై ఉన్న స్క్రీన్ మీద కార్తీ డైలాగ్స్ తో ఉన్న కొన్ని మీమ్స్ వేయగా వాటిని కార్తితో చెప్పేస్తుంది యాంకర్. అయితే అక్కడ ఏ మీమ్స్ వస్తాయో యాంకర్ కి తెలీదు. అక్కడ వచ్చే మీమ్స్ ని బట్టి యాంకర్ ప్రశ్నలు అడుగుతుంది.

ఈ క్రమంలో ఊపిరి సినిమాలోని ఓ డైలాగ్ వచ్చేలా ఓ మీమ్ స్క్రీన్ పై వేశారు. ఆ మీమ్ అర్ధం.. లడ్డు కావాలా నాయనా, ఇంకో లడ్డు కావాలా నాయనా అని వస్తుంది. దీన్నే యాంకర్ మంజూష అడిగి అలాంటి ఇన్సిడెంట్ లైఫ్ లో జరిగిందా అని అడిగింది. అయితే సింపుల్ గా కార్తీ అన్నిటికి సమాధానాలు ఇచ్చినట్టే దీనికి కూడా ఏదో ఒక సమాధానం చెప్తే అయిపోయేదేమో. కానీ కార్తీ ఆ డైలాగ్ కి స్పందిస్తూ.. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది అంటూ కామెడీగా చెప్పారు. దీంతో కార్తీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

కార్తీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కామెడీగా మాట్లాడుతూ లడ్డు వివాదాన్ని ఇండైరెక్ట్ గా గుర్తుచేయడంతో ఆయనదే తప్పు అని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అడిగిన దానికి సింపుల్ గా సమాధానం చెప్తే అన్ని ప్రశ్నల్లో ఇది కూడా వెళ్లిపోయేది అని, హైలెట్ అయ్యేది కాదని అంటున్నారు.

Also Read : Naga Babu : వాళ్లు చేసిన పాపాన్ని ప‌వ‌న్ క‌డిగేస్తున్నారు.. నాగ‌బాబు ట్వీట్ వైర‌ల్‌..

కొంతమంది ఈ ప్రశ్న యాంకర్ అడిగి ఉండకపోతే ఇలా అయ్యేది కాదని అంటున్నారు. అయితే యాంకర్ స్వతహాగా ఆ ప్రశ్న అడగలేదు. ఈవెంట్ నిర్వాహకులు తయారుచేసిన మీమ్స్ స్క్రీన్ పై ఏవి వేస్తే వాటి గురించే అడిగింది. దీంతో అలాంటి మీమ్ ఎందుకు చేసారు అని ఈవెంట్ నిర్వాహకులను కూడా తప్పు పడుతున్నారు కొంతమంది.

ఈ పూర్తి వివాదంలో ఎక్కువ మైలేజ్ కార్తీ సినిమాకు వచ్చింది అని కొంతమంది భావిస్తున్నారు. దేవర రిలీజ్ 27న ఉంది. 28న కార్తీ సత్యం సుందరం సినిమా ఉంది. దేవర హవాలో కార్తీ సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ లడ్డు వివాదంతో, పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో, కార్తీ క్షమాపణలు చెప్పడంతో ఇవాళ ఉదయం నుంచి కార్తీ గురించి, అతని సినిమా గురించి మాట్లాడుతుండటంతో ఇన్నాళ్లు లేని ప్రమోషన్, హైప్ ఇవాళ ఒక్క రోజులో కార్తీ సినిమాకు వచ్చిందని అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ జనాలు.