కార్తీ ‘ఖైదీ’ బాగుందిరా.. రవితేజ కాంప్లిమెంట్

కార్తీ నటించిన తమిళ సినిమా.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తెలుగు, తమిళ్‌లో భారీగా విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఖైదీ’ మూవీకి అన్నిచోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది.
‘ఖైదీ’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని దర్శకుడు లోకేష్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలపడానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్..
Read Also : ‘రమణీయ శ్రీ రామాయణం’ – పుస్తకావిష్కరణ
కార్తీ మాట్లాడుతూ.. ‘రవితేజగారు ఫోన్ చేసి.. సినిమా చాలా బాగుంది. నాకూ ఖైదీ లాంటి సినిమా చేయాలనుందిరా.. నేను చేస్తాను.. నువ్వు తప్పకుండా చూడాలి అన్నారు.. క్లైమాక్స్‌లో గన్ పట్టుకునే సీన్ రాగానే థియేటర్లలో ‘హ్యాపీ దీపావళి’ అని ప్రేక్షకులు అరుస్తున్నారు.. చాలా హ్యాపీగా అనిపించింది. ఓ బామ్మ ఫోన్ చేసి, గొప్ప మంచి సినిమ చేశావ్, చాలా బాగా యాక్ట్ చేశావ్ అని మెచ్చుకున్నారు.. రివ్యూ చెప్పారు. బామ్మకూ నచ్చిందీ యాక్షన్ చిత్రం. అదే నిజమైన సక్సెస్’.. అన్నారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన కె.కె.రాధామోహన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.