Bedurulanka 2012 : చాలా ఏళ్ళ తరువాత ‘బెదురులంక’తో ఆ మాట విన్న కార్తికేయ.. ఏంటి ఆ మాట..?

హీరో కార్తికేయ (Karthikeya) తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ మూవీతో చాలా ఏళ్ళ తరువాత ఒక మాట కార్తికేయ చెవిన పడిందట.

Karthikeya Bedurulanka 2012 had break even in just four days

Bedurulanka 2012 : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ (Karthikeya) తాజాగా ‘బెదురులంక 2012’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్ట్ ఈ సినిమాని చేశాడు. ఈ మూవీ టీజర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతిదీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో ప్రేక్షకుల్లో మూవీ పై మంచి బజ్ ఏర్పడింది. ఆగష్టు 25న ఈ చిత్రం రిలీజ్ కాగా మొదటి షోతోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Vijay Deverakonda : ఈ పరిచయం ప్రత్యేకం.. విజయ్ దేవరకొండ పోస్ట్ ఆమె గురించేనా..?

దీంతో మౌత్ టాక్ తో ఆడియన్స్ అందరిలోకి వెళ్లడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవుతూ వచ్చాయి. కలెక్షన్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. తాజాగా ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 7.40 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. కాగా కార్తికేయకు RX100 తరువాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కాదు కదా హిట్టు అన్న మాట కూడా వినలేదు. దాదాపు ఐదేళ్ల తరువాత ఇప్పుడు బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని తెలియజేశాడు. “సాన్నాళ్లకి సెవిన పడ్డ మాట.. బ్లాక్ బస్టర్” అంటూ పోస్టు వేశాడు.

AS Ravikumar : టీజ‌ర్ లాంచ్‌లో పబ్లిక్‌గా హీరోయిన్‌కు ముద్దు పెట్టిన టాలీవుడ్ ద‌ర్శ‌కుడు.. వీడియో వైర‌ల్‌

ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ కార్తికేయకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా బెదురులంక చిత్రం.. 2012 లో యుగాంతం రాబోతుంది అంటూ ఒక రూమర్ అప్పటిలో ప్రపంచం అంతటా మారుమోగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అదే రూమర్ ని కథగా తీసుకోని కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మూవీలోని ప్రతి యాక్టర్ క్లీన్ కామెడీతో ఆడియన్స్ ని నవ్వించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

 

 

ట్రెండింగ్ వార్తలు