×
Ad

Bedurulanka 2012 : ఓటీటీకి వచ్చేసిన బెదురులంక 2012.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

కార్తికేయ నటించిన రీసెంట్ మూవీ ‘బెదురులంక 2012’ ఎటువంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

  • Published On : September 22, 2023 / 08:55 AM IST

Karthikeya Neha Shetty Bedurulanka 2012 is now in ott streaming

Bedurulanka 2012 : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ (Karthikeya) రీసెంట్ గా ‘బెదురులంక 2012’ అనే కామెడీ డ్రామా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కార్తికేయకు జోడిగా నటించింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు క్లాక్స్ డైరెక్ట్ చేశాడు. ఆగష్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కార్తికేయకి RX100 తరువాత ఒక అలాంటి ఒక బ్లాక్ బస్టర్ ని అందించింది.

Manchu Lakshmi : ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు.. ఎందుకో తెలుసా..?

ఎనిమిది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే.. ఈ మూవీ ఎటువంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime Video) లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్రాన్ని థియేటర్ లో మిస్ అయ్యినవారు ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసేయండి.

Manchu Lakshmi : అవార్డు వేడుకల్లో ఒక వ్యక్తి చేయి చేసుకున్న మంచు లక్ష్మి.. వీడియో వైరల్

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. 2012 లో యుగాంతం రాబోతుంది అంటూ ఒక రూమర్ అప్పటిలో ప్రపంచం అంతటా మారుమోగిపోయిన విషయం అందరికి తెలిసిందే. అదే రూమర్ ని కథగా తీసుకోని కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మూవీలోని ప్రతి యాక్టర్ క్లీన్ కామెడీతో ఆడియన్స్ ని బాగా నవ్వించారు. కార్తికేయ, నేహా జంట ప్రేక్షకులను ఆకట్టుకోగా అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, ఎల్ బి శ్రీరామ్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తమ నటనతో ఆకట్టుకున్నారు.ల ఇక ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన సంగీతం ప్రత్యేక ఆకర్షణ.