Manchu Lakshmi : ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు.. ఎందుకో తెలుసా..?

మంచు లక్ష్మికి ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి ఆహ్వానం వచ్చిందట. ఇంతకీ ఆమెను ఎందుకు పిలిచారు..?

Manchu Lakshmi : ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు.. ఎందుకో తెలుసా..?

invitation come for Manchu Lakshmi from Prime Minister office

Updated On : September 22, 2023 / 8:32 AM IST

Manchu Lakshmi : మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు లక్ష్మి.. సినిమాలు, టీవీ షోలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంది. ప్రస్తుతం స్క్రీన్ పై పెద్దగా కనిపించనప్పటికీ పలు సోషల్ సర్వీస్ లతో మీడియాలో ఎక్కువ కనిపిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈమెకు ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi) ఆఫీస్ నుంచి ఆహ్వానం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆమెను ఎందుకు పిలిచారు..?

Manchu Lakshmi : అవార్డు వేడుకల్లో ఒక వ్యక్తి చేయి చేసుకున్న మంచు లక్ష్మి.. వీడియో వైరల్

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో మహిళా బిల్లును ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే. ఇక దీని గురించి చర్చెందుకు దేశంలోని పవర్ ఫుల్ లేడీస్ ని ప్రభుత్వం ఇన్వైట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మిని కూడా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ ఆహ్వానం వెనుక రాజకీయ కోణం కూడా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం లక్ష్మిని రాజకీయాల్లోకి ఆహ్వానించడానికే పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడడానికి ప్రయత్నిస్తుంది.

Bigg Boss 7 : మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు.. ఈసారి పవర్‌ అస్త్ర..!

ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మిని తెలంగాణ బీజేపీలోకి తీసుకు వచ్చి తమ బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు. కాగా మంచు లక్శ్మి.. ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అనే ఎన్జీవోని స్థాపించి గత కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 530 కు పైగా ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోని వాటిలో స్మార్ట్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాటు చేసింది.