యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తీ నటిస్తున్నయాక్షన్ థ్రిల్లర్.. ‘ఖైదీ’.. దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది..
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’.. ‘మా నగరం’ సినిమాతో ప్రేక్షకలను అలరించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్, సాంగ్స్ లేకపోవడం విశేషం.
ఓ నేరం చేసి దాదాపు పదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తన కూతుర్ని కలసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ‘ఖైదీ’ తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తెలుగులో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహన్ విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. అక్టోబర్ 25న తమిళ్, తెలుగు భాషల్లో ‘ఖైదీ’ రిలీజవుతోంది.
Read Also : విజయ్ ‘విజిల్’ – అక్టోబర్ 25 విడుదల
నరేన్, విజయ్ టివి దీనా, మరియమ్ జార్జ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. సిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, మ్యూజిక్ : శ్యామ్ సిఎస్, ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ : ఎన్. సతీష్ కుమార్, స్టంట్స్ : అన్బరివు, డైలాగ్స్ : పోన్ పార్థిబన్, లోకేష్ కనగరాజ్, నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుప్పుర్ వివేక్.