కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటిస్తున్న ’90ML’ టీజర్ విడుదల..
ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ 369 సినిమాల్లో హీరోగా, రీసెంట్‌గా నానీస్ గ్యాంగ్ లీడర్‌లో నెగెటివ్ క్యారెక్టర్‌లోనూ ఆడియన్స్‌ను మెప్పించిన యంగ్ హీరో కార్తికేయ ప్రస్తుతం ’90ML’ అనే సినిమా చేస్తున్నాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్.
సెప్టెంబర్ 21 కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. కార్తికేయ ఈ మూవీలో దేవదాస్ అనే క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయిన దేవదాస్ మందుకి ఎలా బానిసయ్యాడు.. దానికి కారణాలేంటి అనే అంశాలతో కామెడీ హైలెట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో క్లైమాక్స్ షూట్ చేశారు.
Read Also : దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 : బెస్ట్ యాక్టర్ మహేష్ బాబు..
వచ్చే నెల 7తో టాకీ పూర్తవుతుందని, యూరప్‌లో మూడు పాటలు షూట్ చేస్తామని మేకర్స్ చెప్పారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా : జె.యువరాజ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్రబోస్, ఆర్ట్ : జిఎమ్ శేఖర్, ఫైట్స్ : వెంకట్, డ్యాన్స్ : ప్రేమ్ రక్షిత్, జానీ.