Kashmir Files
Kashmir Files : మార్చ్ 11న చిన్న సినిమాగా రిలీజైన కశ్మీర్ ఫైల్స్ సినిమా పబ్లిక్ టాక్ తోనే భారీ విజయాన్ని అందుకుంది. 1990 దశకంలో కశ్మీర్ లో అక్కడి హిందువులపై జరిగిన మారణకాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టారు. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, నరేంద్రమోడీ సహా ఈ సినిమాని అభినందించారు. చాలా మంది రాజకీయ నాయకులు కశ్మీర్ ఫైల్స్ సినిమా టీంని పిలిచి మరీ అభినందించారు.
కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా భారీ విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించగా దాదాపు 250 కోట్లకు పైగా వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ అయి నిన్నటితో 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇంకా పలు థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. ప్రస్తుత రోజుల్లో ఒక సినిమా 50 రోజులు ఇంకా థియేటర్లలో ఆడుతుంది, అది కూడా చిన్న సినిమా ఆడుతుందంటే ఘన విజయం సాధించినట్టే.
Kangana Ranaut : లాంగ్వేజ్ వార్.. హిందీ వద్దు సంసృతం ముద్దు అంటూ ఎంటర్ అయిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..
కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 50 రోజుల పోస్టర్ షేర్ చేస్తూ..” కశ్మీర్ ఫైల్స్ సినిమా 50 రోజులు పూర్తిచేసుకొని ఇంకా విజయవంతంగా థియేటర్లలో నడుస్తుంది. ఇది నిజం యొక్క విజయం. ఇది మానవత్వం యొక్క విజయం. ఇది నిజంగా ప్రజల సినిమా. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా మే 13న ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల రిలీజైన భారీ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండగా కశ్మీర్ ఫైల్స్ 50 రోజులు అయిపోయిన తర్వాత రావడం విశేషం.
Today #TheKashmirFiles completes 50 days in theatres and still running successfully.
It’s a victory of Truth. It’s a victory of Humanity. It’s truly a people’s film.
Thanks everyone. #RightToJustice pic.twitter.com/YOpB1rFK9s— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) April 29, 2022