Katrina Kaif-Vicky Kaushal: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. పెళ్లెప్పుడంటే?
బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది.
- Naresh Mannam
- Published On : November 7, 2021 / 06:56 PM IST
Katrina Kaif
Katrina Kaif-Vicky Kaushal: బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైందని బలంగా వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ గాసిప్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వ్యవహారం తెలిసే ఉంటుంది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతూ వచ్చారు. అవునని చెప్పకుండా.. కాదని ఖండించకుండా ఎన్ని రూమర్స్ వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.
Katrina Kaif: కళ్ళతో కైపెక్కించే అందం క్యాట్ సొంతం!
అయితే.. సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు బయటకు రావడం.. డిన్నర్ మీటింగ్స్ లో కలసి కనిపించటంతో ఏదో జరిగిపోతుందని ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతూ వచ్చేది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్ ముసుగు తీసేద్దామని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకొని నిశ్చతార్ధం కూడా పూర్తి చేసుకున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తుండగా.. ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్ధమైందని తాజా టాక్.
Vicky Kaushal Katrina Kaif : సల్మాన్ ఖాన్ ముందే “కత్రినా కైఫ్” కు ప్రపోస్ చేసిన యువ హీరో
ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఈ జంట ఒక్కటయ్యేందుకు సిద్దమయ్యారట. రాజస్థాన్‌లో ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. కాకపోతే తమ పెళ్లి గురించి ఎక్కడా బయటకు పొక్కకుండా ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే మొదలైనా వీళ్ళు మాత్రం తమ పెళ్లి వార్తను చాలా రహస్యంగా ఉంచుతున్నారట. ఇంకా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా ఎవరికీ పంపకపోగా అత్యంత సన్నిహితులకు మాత్రమే ఈ ఆహ్వానాలు అందనున్నాయని చెప్తున్నారు.
