Vicky Kaushal Katrina Kaif : సల్మాన్ ఖాన్ ముందే “కత్రినా కైఫ్” కు ప్రపోస్ చేసిన యువ హీరో
బాలీవుడ్ నటులు విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నటుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిపాడు హర్షవర్ధన్. ఈ విషయం బహిర్గతం చెప్పినందుకు తనకు సమస్యలు కూడా ఎదురుకావచ్చంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్ధన్.

Vicky Kaushal Katrina Kaif
Vicky Kaushal Katrina Kaif : బాలీవుడ్ నటులు విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నటుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో విక్కీ కౌషల్ – కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిపాడు హర్షవర్ధన్. ఈ విషయం బహిర్గతం చెప్పినందుకు తనకు సమస్యలు కూడా ఎదురుకావచ్చంటూ చెప్పుకొచ్చాడు హర్షవర్ధన్.
ఇక ఇదిలా ఉంటే ఓ అవార్డు ఫంక్షన్లో విక్కీ కౌశల్ నేరుగా ఓపెన్ అయిపోయారు. వేదికపై విక్కీ కౌశల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కత్రినా కైఫ్, ఆమె మాజీ సల్మాన్ ఖాన్ ప్రియుడుతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అవార్డు అందించేందుకు కత్రినా స్టేజిపైకి వెళ్ళింది.
ఈ సమయంలోనే ‘మంచి వాడైన విక్కీ కౌశల్ లాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా?ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నువ్వు కూడా అలా చేయొచ్చు. అందుకే నేను అడుగుతున్నా’ అని అనే సరికి కత్రినా ఒక్క నిమిషం ఆశ్చర్యానికి గురైంది. ఇక ఆ తర్వాత 2004లో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ముజ్సే షాదీ కరోగి సినిమాలోని ఫేమస్ పాటను పాడతాడు కౌషల్.
అయితే విక్కీ కౌశల్ పెళ్లి విషయం ప్రస్తావించిన సమయంలో సల్మాన్ చిరునవ్వి నవ్వి పక్కనే ఉన్న తన చెల్లి అర్పితా ఖాన్ భుజంపై పడిపోతాడు.. కత్రినా మాట్లాడగానే మత్తులోంచి తేరుకున్నట్లుగా లేచి చూస్తాడు. కాగా ఈ ఘటన 2019లో ఓ అవార్డు వేడుకలో జరిగింది. దానికి సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
View this post on Instagram