Kattappa
Kattappa : రాజమౌళి – ప్రభాస్ బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని పెంచి టాలీవుడ్ రేంజ్ ని మార్చేసిన సినిమా. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అందరికి కనెక్ట్ అయింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర. మాహిష్మతి సింహాసనానికి బానిసగా, యుద్ధ వీరుడుగా ఉండే కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించాడు.(Kattappa)
బాహుబలి సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి కానీ దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. అయితే పార్ట్ 3 తీసే స్కోప్ ఉందని రాజమౌళి, విజయేంద్రప్రసాద్ అన్నారు. బాహుబలి పార్ట్ 3 పక్కన పెడితే దానికంటే ముందు కట్టప్ప సినిమా వచ్చేలా ఉంది. తాజా సమాచారం ప్రకారం రచయిత విజయేంద్రప్రసాద్ కట్టప్ప పాత్రతో సపరేట్ కథ రాస్తున్నారట.
Also Read : Avatar 3 : అవతార్ 3 ట్రైలర్ వచ్చేసింది. ఈసారి ఫైర్ తో.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
అసలు కట్టప్ప ఎవరు? కట్టప్ప ఫ్యామిలీ ఎవరు? కట్టప్ప మాహిష్మతి సింహాసనానికి ఎందుకు బానిస అనే పాయింట్స్ తో బాహుబలికి ముందు జరిగే కథగా విజయేంద్రప్రసాద్ రాస్తున్నారంట. అనుకున్నట్టు సరైన కథ వస్తే విజయేంద్రప్రసాద్ స్వయంగా ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం కూడా ఉందట.
బాహుబలి, భల్లాల దేవా పుట్టకముందు కథ కాబట్టి ఇందులో ప్రభాస్, రానాలు ఉండే అవకాశం లేదు. రమ్యకృష్ణ, నాజర్ అయితే కట్టప్ప సినిమాలో ఉండొచ్చు. మరి కట్టప్ప సినిమా నిజంగానే వస్తుందా చూడాలి.
Also Read : Anaganaga Oka Raju : సంక్రాంతి బరిలోకి ఫిక్స్ అయిన నవీన్ పోలిశెట్టి.. స్పెషల్ ప్రోమో చూశారా? భలే ఉందే..