Anaganaga Oka Raju : సంక్రాంతి బరిలోకి ఫిక్స్ అయిన నవీన్ పోలిశెట్టి.. స్పెషల్ ప్రోమో చూశారా? భలే ఉందే..
తాజాగా ఈ సినిమా సంక్రాతికి పక్కా వస్తుంది అంటూ డేట్ తో సహా అనౌన్స్ చేస్తూ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసారు. (Anaganaga Oka Raju)

Anaganaga Oka Raju
Anaganaga Oka Raju : తక్కువ సినిమాలతో ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోలలో నవీన్ పోలిశెట్టి ఒకరు. చివరగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించాడు. ఆ తర్వాత ఓ యాక్సిడెంట్ తో కొంచెం గ్యాప్ తీసుకున్నాడు. నవీన్ పొలిశెట్టి హీరోగా ‘అనగనగా ఒకరాజు’ సినిమా అనౌన్స్ చేసి సంక్రాంతికి వస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా సంక్రాతికి పక్కా వస్తుంది అంటూ డేట్ తో సహా అనౌన్స్ చేస్తూ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ నిర్మాణంలో మారి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 14 జనవరి 2026 రిలీజ్ కానుంది.
Also Read : Aadya : OG హుడీతో పవన్ కూతురు.. నాన్న సినిమా కోసం అంటూ.. స్పెషల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్..
అనగనగా ఒక రాజు సినిమా నుంచి రిలీజ్ చేసిన సంక్రాంతి స్పెషల్ ప్రోమోలో ఓ జ్యువెల్లరీ యాడ్ లా సరదాగా షూట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
Also Read : Sujeeth : OG సూపర్ హిట్ అయింది.. మరి సుజీత్ నెక్స్ట్ సినిమాలేంటి..? నానితో సినిమా సంగతేంటి..?