Sujeeth : OG సూపర్ హిట్ అయింది.. మరి సుజీత్ నెక్స్ట్ సినిమాలేంటి..? నానితో సినిమా సంగతేంటి..?

OG రిలీజయి పెద్ద హిట్ అయింది. మరి నెక్స్ట్ సుజీత్ సినిమాలేంటి? సుజీత్ ప్లాన్స్ ఏంటి అని చర్చగా మారింది. (Sujeeth)

Sujeeth : OG సూపర్ హిట్ అయింది.. మరి సుజీత్ నెక్స్ట్ సినిమాలేంటి..? నానితో సినిమా సంగతేంటి..?

Sujeeth

Updated On : September 26, 2025 / 10:26 AM IST

Sujeeth : సుజీత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఆయన కెరీర్ లో ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే సినిమా ఇచ్చాడు. OG సినిమా ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా అదిరిపోతున్నాయి. మొదటిరోజే దాదాపు 150 కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. ఇక పవన్ ఫ్యాన్స్ అయితే సుజీత్ ని పొగిడేస్తున్నారు. సుజీత్ కి గుడి కట్టినా తప్పు లేదు అని నెత్తిన పెట్టుకుంటున్నారు.(Sujeeth)

OG రిలీజయి పెద్ద హిట్ అయింది. మరి నెక్స్ట్ సుజీత్ సినిమాలేంటి? సుజీత్ ప్లాన్స్ ఏంటి అని చర్చగా మారింది. ఆల్రెడీ సుజీత్ దర్శకత్వంలో నానితో సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయింది. ప్రస్తుతం నాని పారడైజ్ సినిమా పనిలో ఉన్నాడు. ఆ సినిమా అయ్యాక సుజీత్ సినిమా మొదలవుతుంది. ఈ సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ అనుకుంటున్నట్టు సుజీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also Read : Pradeep Ranganathan : ఇదేం అభిమానంరా బాబు.. OG సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చిన తమిళ్ హీరో.. పోస్ట్ వైరల్..

బ్లడీ రోమియో యాక్షన్, డార్క్ హ్యూమర్ తో ఉండనుందని, సరికొత్త మ్యూజిక్, ఎడిటింగ్ ప్యాట్రన్ తో ఉంటుందని తెలిపాడు సుజీత్. ఇక OG సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ చేసారు కాబట్టి OG 2 కూడా ఉంటుంది. అలాగే గతంలో రామ్ చరణ్ తో ఒక సినిమా అనుకున్నారు సుజీత్ దర్శకత్వంలో. ఆ కథ ఫైనల్ అవ్వలేదని టాక్. ఈ లెక్కన భవిష్యత్తులో రామ్ చరణ్ తో కూడా సుజీత్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సాహో సినిమాతో తన డైరెక్షన్ స్కిల్స్ హాలీవుడ్ లెవల్ అని అందరికి పరిచయం చేసిన సుజీత్ ఇప్పుడు OG తో భారీ కమర్షియల్ హిట్ కొట్టి ఓ రేంజ్ కి ఎదిగాడు.

Also Read : OG Collections : OG ఫస్ట్ డే కల్క్షన్స్ ఎన్ని కోట్లు..? పవర్ స్టార్ కెరీర్ హైయెస్ట్..