Pradeep Ranganathan : ఇదేం అభిమానంరా బాబు.. OG సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చిన తమిళ్ హీరో.. పోస్ట్ వైరల్..

తమిళ్ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. (Pradeep Ranganathan)

Pradeep Ranganathan : ఇదేం అభిమానంరా బాబు.. OG సినిమా చూడటానికి హైదరాబాద్ వచ్చిన తమిళ్ హీరో.. పోస్ట్ వైరల్..

Pradeep Ranganathan

Updated On : September 26, 2025 / 9:45 AM IST

Pradeep Ranganathan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాములు అభిమానులే కాదు సెలబ్రిటీలలో కూడా చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తమిళనాడు స్టార్స్ కూడా చాలా మంది పవన్ ఫ్యాన్స్ అని, పవన్ అంటే ఇష్టం అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. తాజాగా తమిళ్ హీరో OG సినిమా చూడటానికి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడు.(Pradeep Ranganathan)

తమిళ్ హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. లవ్ టుడే, డ్రాగన్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రదీప్ నిన్న సాయంత్రం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి విమల్ థియేటర్లో OG సినిమా చూసారు.

Also Read : OG Collections : OG ఫస్ట్ డే కల్క్షన్స్ ఎన్ని కోట్లు..? పవర్ స్టార్ కెరీర్ హైయెస్ట్..

మొన్న ప్రీమియర్స్ కి టాలీవుడ్ సెలబ్రిటీలంతా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తూ హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ ఇంకా ఫ్యాన్స్ మైండ్ నుంచి పోకముందే తమిళ్ హీరో వచ్చి సినిమా చూడటం, దాని గురించి స్పెషల్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

OG సినిమా చూసిన ప్రదీప్ రంగనాథన్ తన సోషల్ మీడియాలో.. నేను హైదరాబాద్ రావడానికి ఒకే కారణం పవర్ స్టార్ OG సినిమాని చూడటానికి. ఆ మాస్ అనుభవాన్ని తెలుగు వాళ్ళతో కలిసి పంచుకోడానికి అని ట్వీట్ చేసారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారగా తమిళ్ హీరో OG చూడటానికి హైదరాబాద్ వచ్చాడని పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రదీప్ డ్యూడ్ అనే సినిమాతో రాబోతున్నాడు.

Also Read : They Call Him OG : ‘ఓజీ’ మూవీ రివ్యూ.. ఇది కదా పవర్ స్టార్ స్టామినా అంటే.. ఓజస్ గంభీర విధ్వంసం..