‘ప్రశ్నిస్తా.. ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’..

‘కత్తి’ మహేష్‌తో 10 TV రూపొందిస్తున్న సరికొత్త న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్.. ‘కత్తి కటార్ వార్తలు’ (డోంట్ మిస్.. కాంట్రవర్సీ న్యూస్)..

  • Published By: sekhar ,Published On : March 16, 2020 / 07:02 AM IST
‘ప్రశ్నిస్తా.. ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’..

Updated On : March 16, 2020 / 7:02 AM IST

‘కత్తి’ మహేష్‌తో 10 TV రూపొందిస్తున్న సరికొత్త న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్.. ‘కత్తి కటార్ వార్తలు’ (డోంట్ మిస్.. కాంట్రవర్సీ న్యూస్)..

‘కత్తి’ మహేష్.. మీడియా అండ్ సోషల్ మీడియాలో మనోడికి చిన్న సైజు ‘కాంట్రవర్సీ కింగ్’ అనే పేరుంది. సినిమా, పాలిటిక్స్ దేనిగురించైనా ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడడం ‘కత్తి’ స్టైల్.. తన గురించి ఎవరెలా అనుకున్నా తను మాత్రం మాట్లాడడం మానడు. బెదిరింపులకు భయపడడు.. నమ్మిందే చేస్తానంటాడు.. నచ్చిందే చెప్తానంటాడు.

త్వరలో ఓ సరికొత్త ప్రోగ్రామ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ ఇంటి పేరు ‘కత్తి’ వచ్చేలా 10 TV ‘కత్తి కటార్ వార్తలు’ (డోంట్ మిస్.. కాంట్రవర్సీ న్యూస్) అనే న్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్ రూపొందిస్తోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

Read Also : ‘భీష్మ’ బాగుంది – మెగాస్టార్ చిరంజీవి

‘నా ఇంటి పేరులో కత్తి, నా ఒంటి చుట్టూ వైఫైలా కాంట్రవర్సీ ఉంది.. ‘ప్రశ్నిస్తా..ప్రశ్నించడానికే వచ్చా.. ఒక్కొక్కరికీ బల్బులు పగిలిపోతాయ్’.. అంటూ తన స్టైల్‌లో చెలరేగిపోయాడు.. ప్రోమోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. 10 TV ‘కత్తి కటార్ వార్తలు’ న్యూస్ బులిటెన్‌తో ‘కత్తి’ మహేష్ ఏ రేంజ్ సెన్సేషన్, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడో చూడాలి మరి..