Bloody Beggar : తమిళ్ హిట్ సినిమా.. బ్లడీ బెగ్గర్ ఇప్పుడు తెలుగులో..

తమిళ్ లో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

Kavin Tamil Movie Bloody Beggar Releasing now in Telugu

Bloody Beggar : తమిళ్ నటుడు కవిన్‌ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా బ్లడీ బెగ్గర్. ఫిలమెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్ కుమార్ నిర్మాణంలో శివ బాలన్ ముత్తుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా తమిళ్ లో ఇటీవల దీపావళికి రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.

Also Read : NTR – Venkatesh : ఎన్టీఆర్ కొడుకులతో సరదాగా వెంకీ మామ.. వీడియో చూశారా..?

తెలుగులో బ్లడీ బెగ్గర్ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. ఏసియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ లో మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాలో బెగ్గర్ గా నటుడు కవిన్ అదరగొట్టేసాడు అంటూ అతని పాత్రని అంతా పొగుడుతున్నారు.