బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో కోటి రూపాయలు గెలుచుకోవడం అంటే మాటలు కాదు.. లక్+టాలెంట్ కచ్చితంగా అవసరమే. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి 12వ సీజన్‌లో రాంచీ నుండి వచ్చిన నాజియా, కోటి రూపాయలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో రూ. కోటి గెలుచుకున్న రెండవ విజేతగా ఐపిఎస్ అధికారి నిలిచారు.
మోహితా శర్మ, 2017 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో బాడి బ్రాహ్మణంలో సబ్ డివిజన్ పోలీసు అధికారిగా ఉన్న ఆమె, 12వ సీజన్‌లో కోటి రూపాయలు గెలుచుకున్న రెండవ కంటెస్టెంట్‌గా నిలిచారు. ఈ విషయాన్ని సోని ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రమ్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా 7కోట్ల రూపాయల జాక్‌పాక్ ప్రశ్నకు చేరుకున్నట్లుగా ప్రోమోలో వెల్లడించింది.
మోహితా శర్మ.. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాకు చెందిన యువతి, కాగా.. తరువాత ఆమె కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అతని తండ్రి మారుతి కంపెనీలో పనిచేసేవాడు. తల్లి గృహిణి. ఈ ఎపిసోడ్ నవంబర్ 17వ తేదీన టెలికాస్ట్ కానుంది.