కీర్తీ సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న సినిమాలో ఆమె లుక్ విడుదల చేశారు.. ఈ చిత్రం చివరి షెడ్యూల్ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది..
‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 17). స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్‌గా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు సమర్పణలో, వర్త్ ఎ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హిందీలో ‘హైదరాబాద్ బ్లూస్’, ‘రాక్‌ఫోర్డ్’, ‘ఇక్బాల్’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నగేశ్ కుకునూర్ దర్శకుడు. ఆయనకు తెలుగులో తొలి చిత్రమిది. ఆయన మాతృభాష తెలుగే. క్రీడా నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రధారులు. కీర్తీ సురేశ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె లుక్ విడుదల చేశారు.
Read Also : చియాన్ 58లో శ్రీనిధి శెట్టి
మెడలో తాయిత్తు, చేతికి మట్టి గాజులతో హాయిగా నవ్వుతూ ఉన్న కీర్తి లుక్ బాగుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ వచ్చే నెల 11 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. దీపావళికి ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యనున్నారు. సహ నిర్మాత: శ్రావ్య వర్మ, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: చిరంతన్ దాస్.
Presenting our golden girl in her true element. So excited to introduce her to you. No make up & hair – just Keerthy?. Happy birthday superstar! ? #HBDKeerthySuresh@KeerthyOfficial @nkukunoor @AadhiOfficial @IamJagguBhai @eyrahul @SVC_official @sudheerbza #DilRaju @ThisIsDSP pic.twitter.com/h0yXDOPR5n
— Worth A Shot (@WorthAShotArts) October 17, 2019