Keerthy Suresh made interesting comments on the show Jayammu Nischayammu raa.
Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్(Keerthy Suresh). ఆ తరువాత వచ్చిన మహానటితో కెరీర్ లోనే మెమరబుల్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాల తన నటనకు జాతీయ నటిగా అవార్డు కూడా అందుకుంది. ఆ తరువాత వరుసగా అజ్ఞాతవాసి,నేను లోకల్,సర్కారు వారి పాట, దసరా లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఈమధ్య పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఆమె తెలుగులో ఒక టాక్ షోకి గెస్ట్ గా హాజరయ్యారు.
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా.. అదిరిపోయే ప్లాన్ వేసిన బుచ్చిబాబు
అదే సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా”. ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ షోలో కీర్తి సురేష్ పాల్గొని తన పర్సనల్ అండ్ ప్రెఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో భాగంగా హోస్ట్ జగపతిబాబు.. నీకు బాషా సినిమా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉందట కదా. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సివచ్చిందట కదా” అని అడిగాడు. దానికి షాకైన కీర్తి సురేష్.. నవ్వుతూ.. ఎవరో మీకు అన్నీ చెప్పేశారు. పోలీస్ స్టేషన్ కి ఒక్కసారి కాదు చాలాసార్లు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఇది కేవలం ప్రమోలో వచ్చిన సంభాషణే కాబట్టి, అసలు కీర్తి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెల్లాల్సి వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్.
ఫుల్ ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి రివాల్వర్ రీటా. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తెలుగు విషయానికి వస్తే, చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న కీర్తికి ఇటీవల రౌడీ జనార్ధన అనే సినిమాలో అవకాశం వచ్చిందట. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.