Keerthy Suresh makes sensational comments about director Priyadarshan
Keerthy Suresh: కీర్తి సురేష్ నటన గురించి, ఆమె చేసే సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత నేను లోకల్, సర్కారు వారి పాట లాంటి, దసరా లాంటి సినిమాలు చేసింది. ఇక ఆమె చేసిన మహానటి సినిమా (Keerthy Suresh)గురించి ఎంత చెప్పినా తక్కువే. అలనాటి నటి సాయిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో అచ్చుగుద్దినట్టు సావిత్రిలా కనిపించి ఆడియన్స్ ను మెప్పించింది కీర్తి. అంతేకాదు, ఈ సినిమాలో ఆమె నటనకు జాతీయ అవార్డు అందుకుంది.
Rashmika-Sreeleela: ఆ సినిమా చేయకపోవడమే బెటర్.. ఒకవేళ చేసినా.. శ్రీలీల కన్నా రష్మిక బెటర్..
ఇక తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా మెగాస్టార్ హీరోగా వచ్చిన “భోళా శంకర్”. ఈ సినిమాలో ఆమె చిరంజీవికి చెల్లిగా నటించింది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. అలాగే, బాలీవుడ్ లో బేబీ జాన్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె గ్లామర్ షోకి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అయితే, ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న కీర్తి మొదట్లో చాలా అవమానాలు భరించిందట. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె తన స్ట్రగులింగ్ డేస్ గురించి చెప్పింది.
తన మొదటి సినిమా మలయాళంలో తెరకెక్కిన గీతాంజలి సినిమాతో మొదలయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. ఈ సినిమా షూట్ టైంలో అందరిముందే కీర్తి సురేష్ పై అరిచాడట దర్శకుడు ప్రియదర్శన్. దానికి కీర్తి కన్నీళ్లు పెట్టుకుందట. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. కెరీర్ లో మొదటి సినిమా గీతాంజలి. ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్(హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని వాళ్ళ నాన్న) తెరకెక్కించాడు. ఒక సీన్స్ చేస్తున్న సమయంలో కట్ చెప్పి నా దగ్గరకు వచ్చాడు దర్శకుడు ప్రిదర్శన్. వచ్చి “సీన్ ఎంత చెత్తగా చేశావో తెలుసా. ఒకసారి మానిటర్ లో చూసుకో” అంటూ అందరిముందే అరిచాడు. అలా అరవడంతో నాకు ఏడుపొచ్చేసింది. కన్నీళ్లు పెట్టుకుకున్నాను. ఆయన నన్నే కాదు ఆయన కూతురు కళ్యాణి ప్రిదర్శినిపై ఆలాగే అరుస్తాడు”అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.