Keerthy Suresh
Keerthy Suresh : ఇటీవల సినీ పరిశ్రమలో 8 గంటల పనిపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకోన్ తో పాటలు పలువురు ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది 8 గంటలు మాత్రమే పనిచేస్తాము అని అంటుంటే కొంతమంది మాత్రం ఇది జాబ్ కాదు సినిమా షూటింగ్ దానికి తగ్గట్టు ఎప్పుడైనా పనిచేస్తాము అంటున్నారు. తాజాగా దీనిపై కీర్తి సురేష్ స్పందించింది.(Keerthy Suresh)
కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా సినిమా నవంబట్ 28 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది కీర్తి సురేష్. ఈ క్రమంలో ఆమెకు 8 గంటల పనిపై ప్రశ్న ఎదురైంది.
Also Read : I Bomma Ravi : ఐ బొమ్మ రవి బయోపిక్ అనౌన్స్.. టైటిల్ పోస్టర్ వచ్చేసింది..
దీనికి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నేను 9 నుంచి 6 వరకు, 9 నుంచి 9 వరకు, అవసరమైతే ఉదయం 9 నుంచి నెక్స్ట్ డే ఉదయం 2 వరకు కూడా పని చేస్తాను. మహానటి సినిమా చేసేటప్పుడు అదే సమయంలో ఇంకో 5 సినిమాలు కూడా చేసాను. అప్పుడు ఒక సినిమా పొద్దున, ఒక సినిమా రాత్రి చేశాను. నా పర్సనల్ గా నేను అన్ని సమయాల్లో వర్క్ చేస్తాను. కానీ సాధారణంగా ఒక రోజు ఏం జరుగుతుందో మీకు తెలియాలి.
అందరూ 9 నుంచి 6 అని ఎందుకు అంటారు అంటే మేము 9 కి షూటింగ్ సెట్ లో రెడీగా ఉండాలి అంటే 5 కి లెగిసి పనులన్నీ మొదలుపెట్టాలి. 6కి షూటింగ్ అయిపోతే అన్ని సర్దుకొని మేము ఇంటికి వెళ్లేసరికి ఒక 9 అవుతుంది. పనులు చేసుకొని పడుకునే సరికి 10 అవుతుంది. ఇన్ని ఉంటాయి. ఒక్కోసారి పడుకునేసరికి 11 అవుతుంది. కానీ పొద్దున్నే లెగాలి. 8 హవర్స్ స్లీప్ కూడా ఉండదు. ఇక 9 టు 9 అంటే కష్టం. మాకే కాదు సాంకేతిక నిపుణులకు కూడా అంతే. తమిళ్, తెలుగులో కూడా 9 టు 6 ఉంది. కానీ మలయాళం, హిందీలో 12 గంటలు చేయాలి. మలయాళంలో బ్రేక్స్ కూడా ఉండవు. షెడ్యూల్స్ కంటిన్యూగా ఉంటాయి. అది చాలా కష్టం. వాళ్ళు జస్ట్ మూడు నుంచి నాలుగు గంటలు పడుకుంటారు. ఇదే జరిగేది. నేను అన్ని చేస్తాను. కానీ ఆరోగ్యం పరంగా చూసుకుంటే 9 టు 6 కరెక్ట్. ఎందుకంటే మనకు ఫుడ్ తో పాటు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. దీంతో 8 గంటల పనిపై కీర్తి చాలా క్లారిటీగా చెప్పిందని అంటున్నారు.