Kerala: కాలేజీలో హీరోయిన్‌తో విద్యార్థి అసభ్య ప్రవర్తన.. సస్పెండ్ చేసిన యాజమాన్యం
తన కొత్త చిత్రం ‘తంకమ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్ణాకులంలో ఉన్న ఒక లా కాలేజీకి అపర్ణ, చిత్ర యూనిట్‌తో కలిసి హాజరైంది. కాలేజీకి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అపర్ణ సహా, కాలేజీ సిబ్బంది, చిత్ర యూనిట్ స్టేజిపై కూర్చుని ఉన్నారు.
- Narender Thiru
- Published on- January 20, 2023 / 05:19 PM IST
Kerala: కాలేజీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హీరోయిన్‌తో అనుచితంగా ప్రవర్తించాడో విద్యార్థి. ఈ ఘటనపై వివాదం రేగడంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. విద్యార్థిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రముఖ కోలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత అపర్ణా బాలమురళి ఇటీవల కేరళలోని ఒక కాలేజీకి హాజరైంది.
Milk Adulteration: దేశంలో పాల కల్తీపై ఆ ప్రచారంలో నిజం లేదు.. కేంద్రం ప్రకటన
తన కొత్త చిత్రం ‘తంకమ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్ణాకులంలో ఉన్న ఒక లా కాలేజీకి అపర్ణ, చిత్ర యూనిట్‌తో కలిసి హాజరైంది. కాలేజీకి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. అపర్ణ సహా, కాలేజీ సిబ్బంది, చిత్ర యూనిట్ స్టేజిపై కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక విద్యార్థి పరుగెత్తుకుంటూ స్టేజిపైకి ఎక్కి అపర్ణా బాల మురళికి పువ్వు ఇచ్చాడు. అంతలోనే ఆమె లేచి నిలబడింది. అప్పుడు ఆమెపై చేయి వేసేందుకు ఆ విద్యార్థి ప్రయత్నించాడు. అయితే, అప్పుడు అపర్ణా బాలమురళి అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో అపర్ణ చాలా ఇబ్బందిగా ఫీలైంది. తర్వాత అతడు ఫొటో తీయించుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gujarat: వింత ఆచారం.. శివుడికి పీతలు సమర్పిస్తున్న భక్తులు.. ఎక్కడంటే
అపర్ణ అతడి వల్ల ఇబ్బంది పడటంపై చాలా మంది స్పందించారు. విద్యార్థిపై విమర్శలు చేశారు. అపర్ణ అనుమతి లేకుండా, అందరిముందూ ఆమె ఒంటిపై ఎలా చేయి వేస్తాడని నెటిజన్లు ప్రశ్నించారు. విద్యార్థి తీరును తప్పుబట్టారు. ఈ విమర్శల నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై అపర్ణకు క్షమాపణలు చెప్పిన యాజమాన్యం విద్యార్థిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారం రోజులపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
