Gujarat: వింత ఆచారం.. శివుడికి పీతలు సమర్పిస్తున్న భక్తులు.. ఎక్కడంటే

గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో రామ్‌నాథ్ శివ్ గేలా అనే శివుడి దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుడికి బతికున్న పీతల్ని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భక్తులు శివ లింగానికి పీతల్ని సమర్పిస్తున్నారు.

Gujarat: వింత ఆచారం.. శివుడికి పీతలు సమర్పిస్తున్న భక్తులు.. ఎక్కడంటే

Gujarat: సాధారణంగా ఏ దేవుడికైనా పూలు, పండ్లు, పాలు, తేనె వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవార్లకు మాంసాహారం నైవేద్యంగా ఇవ్వడం ఆనవాయితీ. అయితే, గుజరాత్‌లోని ఒక శివుడి గుడిలో మాత్రం పీతల్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు భక్తులు. అవి కూడా బతికున్న పీతల్నే శివుడికి అర్పిస్తారు.

Milk Adulteration: దేశంలో పాల కల్తీపై ఆ ప్రచారంలో నిజం లేదు.. కేంద్రం ప్రకటన

గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో రామ్‌నాథ్ శివ్ గేలా అనే శివుడి దేవాలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుడికి బతికున్న పీతల్ని సమర్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భక్తులు శివ లింగానికి పీతల్ని సమర్పిస్తున్నారు. పూజారులు కూడా దీనికి సహకరిస్తున్నారు. ఇలా దేవుడికి సమర్పించిన పీతలు అన్నింటినీ ఆలయ సిబ్బంది తర్వాత దగ్గర్లోని నదిలోకి తీసుకెళ్లి వదిలేస్తారు. ఏడాదికోసారి శివుడికి పీతలు సమర్పించే కార్యక్రమం జరుగుతుంది.

పీతల్ని సమర్పించడం వల్ల పిల్లల్లో వినికిడి సంబంధిత సమస్యలు తగ్గుతాయని అక్కడి భక్తుల నమ్మకం. పీతలు సమర్పించేందుకు భక్తులు భారీ స్థాయిలో ఆలయానికి చేరుకున్నారు. ఏడాదికోసారి జరిగే తంతు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.