KGF2 : ‘కేజీఎఫ్‌ 2’లో ఐటెం సాంగ్ ఇదేనా??

ఏప్రిల్ లో 'కేజీఎఫ్‌ 2' రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కన్నడ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. 'కేజీఎఫ్‌ 2'లో కూడా ఓ స్పెషల్ సాంగ్.........

Kgf2

KGF2 :   ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ సినిమా నుంచి వచ్చి ‘కేజీఎఫ్‌’ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాతో హీరో యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. కన్నడ సినిమా వ్యాల్యూ కూడా పెరిగింది. ఇప్పుడు అంతా ఈ సినిమా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ లో ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కన్నడ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ‘కేజీఎఫ్‌ 2’లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.

‘కేజీఎఫ్‌ 1’ హిందీ వర్షన్ లో ‘త్రిదేవ్‌’ సినిమాలోని జాకీ ష్రాఫ్‌, సోనమ్‌ ఆడి పాడిన ‘గలీ గలీ మే’ పాటను రీమిక్స్‌ చేశారు. ఇందులో హిందీ బుల్లితెర బ్యూటీ మౌనీ రాయ్‌ స్టెప్పులేసింది. తెలుగులో మాత్రం ‘దోచెయ్‌..’ అంటూ తమన్నాతో ఐటమ్‌ సాంగ్‌ చేయించారు. అలాగే ఇప్పుడు ‘కేజీఎఫ్‌ 2’ సినిమాకి కూడా పాత హిందీ సూపర్‌ హిట్‌ ఐటెం సాంగ్‌ను రీమిక్స్‌ చేశారని సమాచారం. బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని ‘మెహబూబా.. మెహబూబా..’ సాంగ్‌ అప్పట్లో దేశమంతా ఓ ఊపు ఊపేసింది.

Unstoppable With NBK : ఫోన్‌లో ఐ లవ్ యు చెప్పిన బాలయ్య.. ఓ రేంజ్‌లో 8వ ఎపిసోడ్ ప్రోమో

ఇప్పుడు ఆ సాంగ్ ని ‘కేజీఎఫ్‌ 2’లో రీమిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఇందులో యశ్ తో కలిసి స్టెప్పులేసిన ఆ ఐటెం భామ ఎవరో మాత్రం ఇంకా తెలీదు. ‘కేజీఎఫ్‌ 1’ లాగే ‘కేజీఎఫ్‌ 2’లో కూడా హిందీ వర్షన్ కి, సౌత్ వర్షన్ కి వేరు వేరు ఉంటుందా లేదా ఈ సారి ఒకే సాంగ్ ఉంటుందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజం అయితే కనక బాలీవుడ్ లో మరోసారి కేజీఎఫ్‌ కి సక్సెస్ కన్ఫర్మ్ అయినట్టే.